Pan India Stars : పాన్ ఇండియా సినిమాల్లో డబుల్ డోస్ కిక్కు… డ్యూయల్ రోల్స్ చేస్తున్న స్టార్స్ వీళ్లే

Pan India Stars : సినిమా స్పాన్ రోజు రోజుకు మరింతగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు వందల కోట్లను నీళ్ళలా ఖర్చు పెట్టేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ లేదా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా భారీ ప్రాజెక్టులు తెరకెక్కుతున్నాయి. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో నెలకు ఒకటి చొప్పున వరుసగా ఐదు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ బడా సినిమాలు కొన్నింటిలో కొంతమంది స్టార్ హీరోలు డ్యూయల్ రోల్స్ లో అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు. మరి పాన్ ఇండియా ప్రేక్షకులకు డ్యూయల్ రోల్స్ చేసి డబుల్ కిక్ ఇవ్వబోతున్న ఆ స్టార్ హీరోలపై ఓ లుక్కేద్దాం.

1. జూనియర్ ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ మూవీతో సూపర్ సక్సెస్ రుచి చూసిన ఎన్టీఆర్ ప్రస్తుతం మరో పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీని చేస్తూనే, మరోవైపు గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో వార్ 2 మూవీని స్టార్ట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే దేవర మూవీలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. దీనిపై చిత్ర బృందం ఇంకా స్పందించలేదు. ఇక అక్టోబర్ 10న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

2. రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం గేమ్ ఛేంజర్ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పొలిటికల్ డ్రామాలో రాంచరణ్ డ్యూయల్ డ్రోన్ లో సర్ప్రైజ్ చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఇద్దరి మధ్య ఇంటర్వెల్లో వచ్చే ఫైట్ సీన్ సినిమాకి హైలెట్ అని అంటున్నారు.

- Advertisement -

3. కమల్ హాసన్

లోకనాయకుడు కమల్ హాసన్ జూన్ లో ఇండియన్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 1996లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఇండియన్ మూవీకి సీక్వెల్ గా ఇండియన్ 2ను తెరపైకి తీసుకొచ్చారు డైరెక్టర్ శంకర్. అయితే అప్పట్లోనే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన ఇండియన్ మూవీలో కమల్ హాసన్ డబుల్ యాక్షన్ చేశారు. ఇక సీక్వెల్ లో కూడా ఆయన డ్యూయల్ రోల్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది.

4. దళపతి విజయ్

కోలీవుడ్ స్టార్ విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే మూవీని చేస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ తో సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఇప్పటికే గోట్ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లలో మేకర్స్ అఫీషియల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు.

5. సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య త్వరలోనే కంగువా మూవీతో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ డ్రామాలో సూర్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆయన రెండు పాత్రలకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ అయిన విషయం తెలిసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు