Venuswamy: ప్రభాస్ కి అదిరిపోయే బహుమతి ఇచ్చిన వేణు స్వామి భార్య..!

Venuswamy..ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు బాగా సుపరిచితమే.. ఎందుకంటే ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, జాతకాలను సైతం తెలియజేస్తూ నిత్యం ట్రెండీగానే పేరు సంపాదించారు.. అయితే ఒక్కొక్కసారి ఈయన చెప్పే జాతకాలు నిజమైతే మరోసారి అందుకు రివర్స్ లో జరుగుతూ అటు అభిమానులు ఇటు నెటిజెన్స్ చేతుల్లో ట్రోల్స్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత కూడా ఆయన ఆ విషయాల పై స్పందిస్తూ ఉండడం విశేషం. ఇదిలా ఉండగా ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కనిపిస్తున్నారు.. తన భార్య వీణ శ్రీవాణి తో కలిసి అప్పుడప్పుడు పలు రకాల రీల్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ రకంగా కూడా తన ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు ఆస్ట్రాలజర్ వేణు స్వామి.

Venuswamy: Venuswamy wife send a gift to Prabhas..!
Venuswamy: Venuswamy wife send a gift to Prabhas..!

ప్రభాస్ కి గిఫ్ట్ పంపిన వేణు స్వామి భార్య..

వేణు స్వామి భార్య వీణ కూడా తెలుగు , హిందీ ఇతర భాషలలో కూడా పాటలతో, భక్తి గీతాలతో మైమరిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వేణు స్వామి విషయానికి వస్తే.. ప్రభాస్ జాతకం గురించి పలు విషయాలను తెలియజేస్తూ అభిమానులతో దారుణంగా ట్రోల్ కి గురవుతూ ఉంటారు. అయితే తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ కోసం వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి ఒక గిఫ్ట్ పంపించారు.. అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేయడం జరిగింది. అయితే అందులో కొన్ని సీతాఫలాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

మా తోట ఫలాలే పంపించాం..

అయితే కొన్ని కారణాల చేత అలా పెట్టిన ఇంస్టాగ్రామ్ వీడియోని డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోలో”వీణ శ్రీవాణి మాట్లాడుతూ మేం పండించే సీతాఫలాలు ఏటా కొంతమందికి మేము పంపిస్తూ ఉంటాము.. ఇలా ఒక స్పెషల్ వ్యక్తికి ఆ ఫలాలను పంపిస్తే అవి ప్రభాస్ దగ్గరకు చేరాయని తెలిపింది. అంతేకాకుండా ఈ సీతాఫలాలు కూడా ప్రభాస్ కి బాగా నచ్చాయని.. మరికొన్ని కావాలని అడగడంతో పంపిస్తున్నామంటూ వెల్లడించింది వీణ శ్రీ వాణి. వీటితోపాటు తన గుర్తుగా హ్యాండ్ మేడ్ బ్యాగును కూడా పంపిస్తున్నానంటూ తెలియజేసింది. ఈ ఏడాది ఇదే ఆఖరి పంట అని.. మళ్లీ సీజన్ వస్తే మరొకసారి కూడా ప్రభాస్ కి పంపుతానంటూ వీణ శ్రీవాణి వెల్లడించింది.

- Advertisement -

వీణ శ్రీ వాణి చేసిన పనికి ప్రభాస్ ఫ్యాన్స్ ఫిదా..

కానీ వీణ శ్రీ వాణి భర్త వేణు స్వామి మాత్రం ప్రభాస్ జాతకం విషయంలో ఎన్నోసార్లు చివాట్లు కూడా తిన్న సందర్భాలు ఉన్నాయి.. అయితే ఇప్పుడు ఆయన భార్య మాత్రం ప్రభాస్ కి పంపిన గిఫ్ట్ చూసి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ఏది ఏమైనా వేణు స్వామి భార్య షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. వేణు స్వామి గతంలో కూడా పలు సినిమాలలో చిన్నచిన్న క్యారెక్టర్లలో నటించారు. అయితే ఈ మధ్య కూడా చాలామంది సెలబ్రిటీలు వేణు స్వామి దగ్గరికి వచ్చి మరీ స్టార్ స్టేటస్ కోసం పూజలు చేయించుకున్న వారు ఉన్నారు. అలా రష్మిక తో పాటు మరికొంతమంది హీరోయిన్ లు వేణు స్వామి తో పూజలు చేయించుకొని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు