Vishal : మళ్లీ ఆ నటిపై మోజుపడుతున్నాడా ?

Vishal : ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ కొంతమంది హీరోలు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూనే మన తెలుగులో కూడా రాణిస్తూ ఉంటారు. అలాంటి హీరోలలో విశాల్ ఒకరు. తమిళ స్టార్ హీరో విశాల్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన హీరో విశాల్… ఆ తర్వాత తమిళనాడులో సెటిల్ అయ్యారు. తన కుటుంబ నేపథ్యం కారణంగా… కుప్పంలో పుట్టి ఆ తర్వాత చెన్నైకి తరలి వెళ్ళింది విశాల్ కుటుంబం.

దీంతో హీరో విశాల్ కు తమిళంలోనే కాకుండా మన తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. ఇలాంటి అవకాశం ఎవరికీ ఇప్పటి వరకు రాలేదని చెప్పవచ్చు. విశాల్ సినిమా తీశాడు అంటే తమిళ ఇండస్ట్రీలో కంటే మన తెలుగులో ఎక్కువగా చూస్తారు ప్రేక్షకులు. అంతలా విశాల్ పాపులర్ అయ్యాడు. అయితే తన తండ్రి అండదండలతో ఇండస్ట్రీలు అడుగుపెట్టిన హీరో విశాల్… తెలుగులో అలాగే తమిళ ఇండస్ట్రీలో చాలా సినిమాలే చేశాడు.

ముఖ్యంగా తెలుగులో అప్పట్లో వచ్చిన పందెంకోడి సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 2005 సంవత్సరంలో వచ్చిందన్న సంగతి తెలిసిందే. అప్పుడే తెలుగు ఇండస్ట్రీకి హీరోగా విశాల్ పరిచయమయ్యాడు. ఆ తర్వాత పూజ, దీరుడు, జయ సూర్య, ఒక్కడొచ్చాడు, డిటెక్టివ్, పందెంకోడి రెండవ భాగం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు చేశాడు ఈ హీరో విశాల్. హీరో విశాల్ సినిమా చేశాడంటే కచ్చితంగా తమిళంలో రిలీజ్ చేయడమే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ చేస్తాడు. సినిమాలు డబ్ చేయించి మరి రిలీజ్ చేస్తాడు హీరో విశాల్.

- Advertisement -

ఇక 2023 సంవత్సరంలో మార్క్ ఆంటోనీ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హీరో విశాల్ ఇప్పుడు మరో సినిమా హిట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అయితే ఇప్పటివరకు హీరో విశాల్ పెళ్లి చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. కానీ హీరో విషయాలు లైఫ్ లో చాలా ఎఫైర్లు ఉన్నట్లు ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో అప్పట్లో ప్రేమైన నడిపాడు హీరో విశాల్. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు.

కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల విడిపోయారు. అయితే ఇటీవల నటి వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. ఆమె నిశ్చితార్థం పై తాజాగా స్పందించాడు హీరో విశాల్. ఈ సందర్భంగా ఆమె ఎంగేజ్మెంట్ పై విశాల్ మాట్లాడుతూ… వరలక్ష్మి వివాహ బంధంలో అడుగు పెడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని వెల్లడించాడు. ఆమెకు నా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ ఎమోషనల్ అయ్యాడు.

నటిగా ఆమె చేరుకోవాలనుకున్న లక్ష్యం చేరుకుంది అని తెలిపాడు. తెలుగులో కూడా బాగా రాణిస్తుందని… ఇక ఇప్పుడు వివాహ బంధంలో కూడా అలాగే రాణించాలని కోరుకుంటున్నట్లు హీరో విశాల్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే విశాల్ చేసిన కామెంట్స్ విన్న నెటిజెన్స్… ఇంకా వరలక్ష్మిని మనోడు మర్చిపోవడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు