Sekhar Master: శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం..!

Sekhar Master.. ప్రముఖ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ షేర్ చేస్తూ..” ఎంతో బాధను అనుభవించావు.. ధైర్యంగా నిలబడ్డావు.. నువ్వే నాకు ధైర్యాన్ని ఇచ్చావు.. ఇప్పుడు నువ్వు లేవనే వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను.. ఇప్పుడైనా మంచి ప్రదేశంలో చేరి ఉంటావని ఆశిస్తున్నాను.. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు… నీ ఆత్మకు శాంతి చేకూరాలి “అంటూ షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు అందరినీ కలచి వేస్తోంది..

Sekhar Master: Deep tragedy in Shekhar Master's house..!
Sekhar Master: Deep tragedy in Shekhar Master’s house..!

శేఖర్ మాస్టర్ వదిన కన్నుమూత..

దీంతో సినీ ప్రముఖులు, నెటిజనులు, అభిమానులు శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్నారు.. ఇక అసలేం జరిగిందనే విషయానికొస్తే.. తాజాగా శేఖర్ మాస్టర్ వదిన కన్నుమూసినట్లు తెలుస్తోంది. తల్లిగా భావించిన తన వదిన కన్నుమూసేసరికి శేఖర్ మాస్టర్ కుమిలిపోతున్నారు.. ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోతూ ఉండడం గమనార్హం. ఇక శేఖర్ మాస్టర్ వదిన మరణానికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు… ఆ బాధ నుంచి తేరుకోవాలని శేఖర్ మాస్టర్ ను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.

శేఖర్ మాస్టర్ పోస్ట్ పై స్పందించిన విష్ణు ప్రియ..

శేఖర్ మాస్టర్ అత్యంత దుఃఖంతో చేసిన ఈ పోస్టుపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ కూడా స్పందిస్తూ ఓంశాంతి అంటూ పోస్ట్ షేర్ చేసింది.. అలాగే నెటిజన్ లు, అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు చేస్తున్నారు..

- Advertisement -

శేఖర్ మాస్టర్ సినిమాలు..

శేఖర్ మాస్టర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రముఖ టీవీ ఛానల్ లో , డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ ని ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు.. వీటితో పాటు కొన్ని స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు శేఖర్ మాస్టర్. ఇక ఇటీవలే చిరంజీవి సినిమాలోని పాటలకు కొరియోగ్రఫీ అందించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అటు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ ఇటు తన కొరియోగ్రఫీతో అభిమానులను కూడా దక్కించుకున్నారు. చిరంజీవి , మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల పాటలకు కంపోజ్ చేసిన ఈయనకు ఇప్పుడు విశ్వంభర సినిమాకి మాత్రం పిలుపు వచ్చినట్టు కనిపించడం లేదు.

శేఖర్ మాస్టర్ కెరియర్..

శేఖర్ మాస్టర్ కెరియర్ విషయానికి వస్తే.. తెలుగు , హిందీ, కన్నడ సినిమా రంగ పాటలకు కొరియోగ్రఫీ అందించారు. 1979 నవంబర్ 6న ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జన్మించిన ఈయన.. విజయవాడలో ఒక ఇన్స్టిట్యూట్ లో క్రాష్ కోర్స్ నేర్చుకున్నారు.. 1996లో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా సభ్యత్వ కార్డును కూడా పొందారు. ఇక కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేసిన శేఖర్ మాస్టర్.. ప్రస్తుతం మూవీ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు.. మరోవైపు కొరియోగ్రాఫర్ గా మారక ముందు ఆరు సంవత్సరాలు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా , 8 సంవత్సరాలు అసిస్టెంట్ గా కూడా పనిచేశారు. అలా కెరియర్ లో మొత్తం 63 చిత్రాలకు పనిచేసినట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Sekhar Vulli Vj (@sekharmaster)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు