Gaami : మన పెద్దలు అంటున్నాడు .. కానీ అసలు విషయం ఇదేనా?

టాలీవుడ్ లో ఈ మహా శివరాత్రికి రిలీజ్ అయిన క్రేజీ సినిమాల్లో “గామి” మూవీ కూడా ఒకటి. రిలీజ్ కి నెల ముందు వరకు కూడా గామి సినిమా గురించి చాలా మందికి తెలీదు. అయితే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం వల్ల ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. పెయిడ్ ప్రీమియర్ల ద్వారా వచ్చిన మౌత్ టాక్ గామి కి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇక ఫాంటసీ కథని జోడించి తీసిన ఈ సినిమా మంచి టాక్ తో పాటు సాలిడ్ ఓపెనింగ్స్ ని కూడా దక్కించుకుందన్న విషయం తెలిసిందే. దర్శకుడు విద్యాధర్ ఆరేళ్ళ పాటు కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించానని చెప్పడం జరిగింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర సినిమాల పోటీ ఉన్నా కూడా దీనికే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. అన్నిటికీ మించి మహాశివరాత్రి స్పెషల్ గా ఈ సినిమాలో శివుడికి చెందిన రిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి, ఆడియన్స్ కూడా గామి సినిమా చూడ్డానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు.

పెద్దలు మాట్లాడితే బాగుంటుంది..

ఇక అసలు విషయానికి వస్తే గామి మహాశివరాత్రి కానుకగా రిలీజ్ కాగా, ఈ సినిమా కి యానానిమస్ గా టాక్ రావడంతో ట్రేడ్ పండితులు కూడా ఈ సినిమాకి పాజిటివ్ గా రివ్యూలు ఇచ్చారు. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా పెట్టిన సక్సెస్ మీట్ లో విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ ప్రెస్ మీట్ లో విశ్వక్ మాట్లాడుతూ ఇది మంచి సినిమా ప్లీజ్ చూడండి, అలాగే మా సినిమాకు కూడా నలుగురు పెద్దలు వచ్చి మాట్లాడితే బాగుంటుంది, ఇది మన తెలుగు సినిమా అన్నాడు. ఈ మాటలు సోషల్ మీడియా లో తెగ ట్రోల్ అవుతున్నాయి. ఎందుకంటే దీనికి ముందు విశ్వక్ సేన్ తన గత సినిమా ఈవెంట్ లో తనని ఎవ్వరూ లేపాల్సిన పనిలేదు, నన్ను నేనే లేపుకుంటా అన్నాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు బాగా ట్రోల్ అయ్యాయి. ఇక తాజాగా గామి ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ కి దీనికి లింక్ చేసి సోషల్ మీడియా లో తెగ ఆడేసుకుంటున్నారు నెటిజన్లు.

- Advertisement -

అసలు విషయం ఇదేనా?

అయితే గామి సక్సెస్ మీట్ లో విశ్వక్ సేన్ తమ సినిమాని కూడా చూసి మాట్లాడండి అని సినీ పెద్దలని రిక్వెస్ట్ చేయడం వెనుక వేరే కారణం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఆ కారణం ఏంటంటే.. గామి సినిమా రిలీజ్ అయ్యాక మంచి టాక్ తో, అలాగే మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మూవీ మేకర్స్ తమ సినిమా వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ అయిందని, నాలుగురోజుల్లోనే 23 కోట్లు వసూలు చేసిందని పోస్టర్లు కూడా వదిలారు. అయితే గామి సినిమా నిజానికి రిలీజ్ అయిన 6 రోజుల్లో అంటే ఇప్పటివరకు కూడా 9.91 కోట్ల షేర్, 18.88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే గామి బ్రేక్ ఈవెన్ కావడానికి మరో రెండు కోట్ల వరకు కావాలి.

అయితే గామి సినిమా సెకండ్ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ కాబోతున్నా కూడా ఈ సినిమా మేకర్స్ భారీ కలెక్షన్లు రావాలని కోరుకుంటున్నారట. పైగా పోస్టర్లలో పాతిక కోట్ల కలెక్షన్లు అంటూ వీకెండ్ లోనే చెప్పారు. అలాంటప్పుడు ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదంటే పరువు పోతుందని, దానికి సెలెబ్రిటీల సపోర్ట్ ఏమైనా ఉంటే సెకండ్ వీకెండ్ లో మంచి కలెక్షన్లు రాబట్టొచ్చని భావిస్తున్నారట. మరి ఈ ఉద్దేశ్యం తోనే విశ్వక్ కామెంట్స్ చేసాడని కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు. పైగా వీకెండ్ తర్వాత గామి కంటే భీమా సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వస్తుండడం గమనార్హం.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు