HBD Aamir khan: కోట్లకు అధిపతి అయినా.. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్..!

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ప్రస్తుతం తన ప్రాజెక్టు షూటింగ్లో బిజీగా ఉంటూ త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే లాల్ సింగ్ చద్దా సినిమా డిజాస్టర్ అయిన తర్వాత తన దృష్టి మొత్తం సినిమాల పైన పెట్టినా.. త్వరలోనే తన తదుపరి చిత్రాలపై అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారు.. ఇదిలా ఉండగా ఈరోజు ఆయన పుట్టినరోజు కాగా ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆయనకు సంబంధించిన లేటెస్ట్, రేర్ ఫొటోస్ తో పాటు వీడియోలను కూడా నెట్టింట పంచుకుంటున్నారు..

అమీర్ ఖాన్ ఆస్తులు..
ఇదిలా ఉండగా ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ వద్ద ఉన్న ఆస్తుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. వాటి గురించి పూర్తి విషయాలు ఇప్పుడు చూద్దాం.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమా రంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది.. సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి గానూ పద్మశ్రీ , పద్మభూషణ్ అవార్డులు కూడా లభించాయి.. ఇక ప్రస్తుతం ఆయన ఆస్తి రూ .1,862 కోట్లు ఉన్నట్లు సమాచారం.. నటన, చిత్ర నిర్మాణం, బ్రాండ్ ప్రమోషన్ వివిధ పెట్టుబడుల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు.. అంతేకాదు లాస్ ఏంజెల్స్ లో రూ.75 కోట్ల విలువైన మాన్షన్ హౌస్ ని కూడా కలిగి ఉన్నారు అమీర్ ఖాన్.. అలాగే ముంబైలోని బాంద్రాలో ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణం తో రెండు అంతస్తులతో ఒక ఇల్లు ఉంది.. ఇందులో ఒక అంతస్తు ఆఫీస్ పనులకు వినియోగిస్తుండగా.. మరో అంతస్తు వ్యక్తిగతంగా ఉపయోగిస్తున్నారట.. దీని ధర దాదాపు రూ.60 కోట్లు అని సమాచారం.

అమీర్ ఖాన్ కార్ ల లిస్ట్..
అమీర్ ఖాన్ కి కార్లంటే చాలా పిచ్చి.. అందుకే ఆయన దగ్గర చాలా కార్లు ఉన్నాయి.. వీటిలో చాలా లగ్జరీ కార్లు ఉండడం విశేషం.. రూ .8కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ , రూ.10.50 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ S600 కారు ఈయన సొంతం..

- Advertisement -

అమీర్ ఖాన్ ఫామ్ హౌస్..
చాలామంది సెలబ్రిటీలకు సొంతంగా ఫామ్ హౌస్ ఉన్నట్టుగానే అమీర్ ఖాన్ కి కూడా పొంచగని లో రెండెకరాల ఆస్తిని కలిగి ఉన్నాడు.. దీని విలువ 7 కోట్ల రూపాయలు.. సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వెళ్లిపోతారట అమీర్ ఖాన్.. అంతే కాదు ఈ భూమిని పొందే సమయంలో స్టాంప్ డ్యూటీ కింద రూ .42 లక్షలు చెల్లించినట్లు సమాచారం.

ఇకపోతే ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ అమీర్ ఖాన్ మాత్రం చాలా సింపుల్ గా ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. అందుకే కోట్లకు అధిపతి అయినా సింప్లిసిటీ కేరాఫ్ అడ్రస్ అంటారు అమీర్ ఖాన్ ను..

అమీర్ ఖాన్ కూతురు పెళ్లి..
ఇటీవలే అమీర్ ఖాన్ తన కూతురు ఐరా ఖాన్ వివాహాన్ని చాలా ఘనంగా జరిపించిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకలో అందరి తండ్రుల్లాగే అమీర్ ఖాన్ కూడా కంటి తడి పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. మరొకసారి తండ్రి హృదయాన్ని అభిమానులకు పరిచయం చేశారు అమీర్ ఖాన్..

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు