Aamir Khan: అమీర్ ఖాన్ మొదటి పెళ్లి వెనుక ఇంత కథ జరిగిందా..?

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ రెండు వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే అమీర్ ఖాన్ ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత జీవితాన్ని.. కెరియర్ జీవితాన్ని వేరుగా ఉంచడానికి ఇష్టపడతారని తెలిసిన విషయమే.. అయితే అమీర్ ఖాన్ తన మొదటి భార్య నుంచి విడిపోయినప్పుడు కూడా తన జీవితంలో ఆ సందర్భం క్లిష్ట సమయంగా పేర్కొన్నారు. ఇకపోతే తాజాగా అమీర్ ఖాన్ రీనా దత్తాను వివాహం చేసుకున్నప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగాయి.. వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అన్న విషయం మళ్ళీ వైరల్ గా మారింది.

1986 ఏప్రిల్ 18వ తేదీన అమీర్ ఖాన్ రహస్యంగా రీనా దత్తాను వివాహం చేసుకున్నారు.. అయితే ఈ వివాహానికి రీనా కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించలేదు.. దీంతో రీనా దత్తా తన కుటుంబాన్ని కూడా ఎదిరించి రహస్యంగా అమీర్ ఖాన్ ను వివాహం చేసుకోవడం అప్పట్లో పెను సంచలనాలకు దారి తీసింది. అయితే ఇద్దరు వేరువేరు మతాలకు చెందిన వారు కావడమే దీనికి కారణం.. రీనా హిందువు అయితే.. అమీర్ ఖాన్ ముస్లిం.. ఎయిర్ ఫోర్స్ అధికారి అయిన తండ్రి వారి పెళ్లికి అంగీకరించలేదు.. ఇక అమీర్ తన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమా షూటింగ్ సమయంలో రీనాను వివాహం చేసుకున్నారు.. అయితే దాదాపు ఏడాది ముందే వీరి ప్రేమ వివాహం మొదలైంది ఆ సమయంలో రీనా వయసు 18 కాగా అమీర్ వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే.

ఇక ఆ వయసులో తమ ప్రేమ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఇక ఆ సమయంలో తమ పెళ్లి జరగడం కష్టమని భావించిన అమీర్ ఖాన్.. తనకు 21 ఏళ్లు వచ్చిన వెంటనే రీనాను కోర్టుకి తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఇద్దరు రహస్యంగా తమ ఇళ్లకు వెళ్లిపోయారు. చాలా కాలం తర్వాత రీనా కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది.. ఇక తన మాట కాదని రీనా వివాహం చేసుకోవడంతో జీర్ణించుకోలేకపోయిన రీనా తండ్రి అనారోగ్యం పాలయ్యారు. మరోవైపుఈ పెళ్లికి అమీర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.. అడిగినాను..రీనాను కోడలిగా స్వాగతించారు.. కానీ రీనా తండ్రి మాత్రం అంత త్వరగా వీరి వివాహాన్ని అంగీకరించలేకపోయారు.. దీంతో రీనా చాలా గొడవలు పడి అమీర్ ఖాన్ ను వివాహం చేసుకుంది.

- Advertisement -

దాదాపు 16 సంవత్సరాల పాటు కొనసాగిన వీరు 2002లో విడాకులు తీసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్, కుమార్తె ఇరా జన్మించారు. ఇకపోతే విడాకుల తర్వాత రీనా ఒంటరిగానే ఉన్నా.. అమీర్ ఖాన్ మాత్రం కిరణ్ రావును వివాహం చేసుకున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు