Samantha: సొంతూరు పై సమంత మనసు పారేసుకుందా..కామెంట్స్ వైరల్..!

మనం జన్మించిన ఊరంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి.. అది సెలబ్రిటీలైనా.. సామాన్యులైనా.. అందుకే ఏదో ఒక సందర్భంలో తాము జన్మించిన ఊరికి వెళ్లాలి అని.. అక్కడ తమ వారికోసం ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు.. ఈ క్రమంలోని తాజాగా ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కూడా తన సొంత ఊరిపై మనసు పారేసుకున్నట్లు తెలుస్తోంది. సమంత సొంత ఊరు చెన్నై అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలోనే చెన్నైలో సత్యభామ యూనివర్సిటీలో జరిగిన ఒక ఈవెంట్లో సమంత పాల్గొనగా.. అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ బ్యూటీ పంచుకుంది.. “సొంతూరులో దక్కే ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే” అని చెబుతూ సమంత ఈ ఫోటోలను షేర్ చేయడం గమనార్హం..

ఇకపోతే ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఇప్పటివరకు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటూనే ఉంది. ఇక సమంత తాజాగా నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కావాల్సి ఉండగా.. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది..ప్రస్తుతం ఈమె నటించిన సినిమాలేవి కూడా పెద్దగా లేవు కాబట్టి సోషల్ మీడియాలో తన వరుస గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది ఈ ముద్దుగుమ్మ..

https://www.instagram.com/p/C3cBmsALtKU/?utm_source=ig_web_button_share_sheet

- Advertisement -

గత కొన్ని సంవత్సరాలుగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సందర్భంగా ఏడాది పాటు సినిమాలకు విరామం ఇచ్చింది. అందుకే ఏ సినిమాలో కూడా నటించడం లేదు. మరి రీ ఎంట్రీ లో సమంత కమర్షియల్ సినిమాలకు ఓకే చేస్తారా.. లేక లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తారా.. అన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే సమంత షేర్ చేసిన ఫోటోలకు 12 లక్షలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి. సమంత అభిమానులు కూడా ఎంతమంది హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నా సమంత మాకు ఎప్పటికీ ప్రత్యేకమే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం .ఇకపోతే వయసు పెరుగుతున్నా.. తన గ్లామర్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ అదే అందంతో.. రెట్టింపు హుషారుతో ప్రేక్షకులను అలరిస్తోంది..

ఇకపోతే సమంత ప్రముఖ హీరో నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వైవాహిక జీవితంలో లొసగులు వచ్చిన కారణంగా పెళ్ళైన నాలుగు సంవత్సరాలకే విడిపోయింది. ఇక విడాకుల తర్వాత ఎవరికి వారు తమ కెరియర్ పై బిజీగా ఉన్నారు. మరొకవైపు నాగచైతన్య తండేల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు