Samantha : మెగాస్టార్ సినిమాను సమంత రిజెక్ట్ చేసిందా?

Samantha

సౌత్ క్వీన్ సమంత గత కొంతకాలంగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతుండగా, ఈ జబ్బు నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు ఏడాది విరామం తర్వాత తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు సామ్ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె కొన్ని నెలల ముందు ఈ ప్రకటన చేసి ఉంటే చిరు భారీ సినిమా “విశ్వంభర”లో నటించే ఛాన్స్ ఉండేదనే చర్చ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో జరుగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర”. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మేకర్స్ ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా కాలం పాటు సెర్చ్ చేశారు. చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. చివరకు త్రిషను కన్ఫర్మ్ చేశారు. అయితే అందరికంటే ముందు ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ ఆలోచించినట్టు ఒక ఆసక్తికరమైన రూమర్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

కానీ అప్పట్లో సమంత మయోసైటిస్ నుంచి కోలుకోవడానికి చికిత్స తీసుకోవడం, అదే సమయంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ కొత్త సినిమాలకు సైన్ చేయడానికి రెడీగా లేకపోవడంతో ఆ ఆఫర్ అనుష్క దగ్గరకు వెళ్లిందట. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ అనుష్క కూడా తప్పుకుంది. అలా చివరకు త్రిషను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ సమంత కొన్ని నెల క్రితమే తన రీ ఎంట్రీ గురించి ప్రకటించి ఉంటే, కచ్చితంగా ఆమె “విశ్వంభర” సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సైన్ చేసి ఉండేది అంటున్నారు.

- Advertisement -

ఇదిలా ఉండగా ఇప్పుడు సమంత నెక్స్ట్ మూవీ గురించి ఆమె అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆమె హీరోయిన్ గా చేసిన గత రెండు చిత్రాలు శాకుంతలం, ఖుషి సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సామ్ సైన్ చేయబోయే కొత్త సినిమాలు ఏంటి అని ఆరా తీస్తున్నారు. గతంలో పుష్ప ఫస్ట్ పార్ట్ లో “ఊ అంటావా మావా… ఉఊ అంటావా” అనే ఐటమ్ సాంగ్ తో సమంత ఎలాంటి మాయ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అందుకే మేకర్స్ “పుష్ప 2″లో కూడా సామ్ గెస్ట్ రోల్ ను ప్లాన్ చేయాలని పరిశీలిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆమె చేతిలో ఉన్న ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ చేజారింది. మరోవైపు “సిటాడెల్” అనే వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఇప్పుడు సమంత చేయబోయే కొత్త సినిమా ఏంటో తెలియాలంటే వెయిట్ అండ్ సీ.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు