Suhani bhatnagar: ఆ రోగమే దంగల్ నటి ప్రాణం తీసిందా..?

సినీ ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది సెలబ్రిటీలు చిన్నవయసులోనే మరణిస్తూ అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దంగల్.. ఇందులో యువ బబిత కుమారి ఫోగట్ పాత్ర పోషించిన సుహాని భట్నాగర్ ఫిబ్రవరి 16న ఢిల్లీలో మరణించడం అభిమానులకు మరింత బాధను కలిగించింది. ఇక పోతే ఈమె వయసు కేవలం 19 సంవత్సరాలు..ఈమె మరణాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ తాజాగా ధ్రువీకరించడంతో సెలబ్రిటీలు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆమె మరణానికి గల కారణాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుండగా.. తాజాగా సుహానీ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం.. సుహాని చేతులు పూర్తిగా వాచిపోయాయి.. మొదట్లో ఇది సాధారణమైనదిగా భావించాము.. కానీ ఆ వాపు కొద్ది రోజుల తర్వాత ఇంకొక చేతికి.. అలా శరీరం మొత్తం వ్యాపించింది.. ఈ సమస్యపై ఎంతో మంది వైద్యులను సంప్రదించాము. కానీ ఆమె అనారోగ్యం కుదుటపడలేదు.. సుమారు 11 రోజులపాటు ఎయిమ్స్ లో చికిత్స పొందింది. అక్కడ పరీక్షలలో ఆమెకు అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి డెర్మటోమయోసైటీస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధికి స్టెరాయిడ్స్ మాత్రమే చికిత్స. దీంతో స్టెరాయిడ్స్ తీసుకుంది..ఆ ప్రభావం క్రమంగా ఈమె శరీర రోగనిరోధక వ్యవస్థ పై పడి ..క్రమంగా రోగనిరోధక శక్తి బలహీనపడింది..

ఇక సుహాని తిరిగి వ్యాధి నుండి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు కూడా చెప్పారు.. అయితే ఆమెలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ బారిన పడింది.. ఇక ఊపిరితిత్తులు బలహీనపడి.. ద్రవం పేరుకుపోయి.. శ్వాస తీసుకోవడం కష్టం అయింది.. దీంతో ఫిబ్రవరి 16 సాయంత్రం ఆమె మరణించింది అంటూ సుహానీ తండ్రి చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.. ఇకపోతే ఈ వార్తను అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ ధ్రువీకరించింది..

- Advertisement -

” మా సుహానీ మరణించడం గురించి వినడం మాకు మరింత బాధ కలిగించింది.. ఆమె తల్లి పూజాజీకి, మొత్తం కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము.. ఇంత ప్రతిభావంతులైన యువతి లేకుంటే దంగల్ అసంపూర్ణంగా ఉండేది.. శాంతితో విశ్రాంతి తీసుకో” అంటూ నోట్ ముగించింది.. ఈమె మరణం పై పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఏదిఏమైనా ఎంతో భవిష్యత్తు ఉన్న సుహానీ .. జీవితంలో ఏమీ చూడకుండా..అనుభవించకుండానే అతి చిన్న వయసులోనే మరణించడం మరింత బాధాకరమని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు