Viswak Sen: ఇది రియలైజేసన్

తెలుగు యంగ్ హీరో విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోమాకే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ ఆ తర్వాత కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. అయితే విశ్వక్సేన్ చేసిన వెళ్ళిపోమాకే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు విశ్వక్సేన్.

ఈ నగరానికి ఏమైంది సినిమాలో విశ్వక్సేన్ చేసిన కౌశిక్ రోల్ అద్భుతంగా ప్రేక్షకులు ఆకట్టుకుంది. ఆ టైమింగ్, తరుణ్ భాస్కర్ రైటింగ్ ఇవన్నీ కూడా యూత్ కి క్రేజీగా అనిపించాయి. మొత్తానికి ఈ సినిమా సక్సెస్ఫుల్ గా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేసినప్పుడు కూడా ఆడియన్స్ ఇదే విధంగా ఈ సినిమాను హిట్ చేసారు.

ఈ సినిమా తర్వాత విశ్వక్ సేన్ దర్శకుడుగా కూడా తనలో టాలెంట్ ను బయటకు తీసారు. ఫలక్నామా దాస్ అనే ఒక సినిమాను దర్శకుడుగా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాని తెలుగుకి అన్వయించి విశ్వక్సేన్ బాగానే చేసి సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు.

- Advertisement -

అయితే ఒక సినిమా రిలీజ్ కి ముందు ఆ సినిమాని ప్రమోట్ చేయడం కామన్. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్సేన్ మాట్లాడుతూ, ఆల్రెడీ ఒకడిని ఇలానే లేపినం వాడిప్పుడు మా పైకెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ వీడిని కూడా లేపాలా అంటూ నా గురించి కొంతమంది అంటున్నారు. నన్ను ఎవడు లేపాల్సిన పనిలేదు. నన్ను నేనే లేపుకుంటా అంటూ అప్పటి స్పీచ్ లో చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్. ఆ స్పీచ్ అప్పుడు కాస్త వైరల్ గా మారింది.

ఆ తర్వాత విశ్వక్సేన్ చాలా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. విశ్వక్సేన్ కెరియర్లో మంచి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే విశ్వక్సేన్ రీసెంట్ గా గామి అని ఒక సినిమాను చేశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. అయితే ఈ సినిమాని గత ఆరేళ్లుగా తెలుగు సినిమాలో తెరకెక్కిస్తున్నారు. గత నాలుగు ఏళ్లుగా విశ్వక్సేన్ షూటింగ్ లో పాల్గొన్నారు.

ఇకపోతే ఈ సినిమా రీసెంట్ గా రిలీజై మంచి సక్సెస్ ను అందుకోవడంతో ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించిది చిత్ర యూనిట్. ఈ ప్రెస్ మీట్ లో విశ్వక్సేన్ మాట్లాడుతూ మా సినిమా గురించి కూడా ఒక నలుగురు పెద్దలు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రేమలు అనే సినిమాకి మహేష్ బాబు ట్వీట్ చేశారు. అలానే రాజమౌళి కూడా ఆ సినిమాపై కొన్ని ప్రశంసలు కురిపించారు. వీళ్లను ఉద్దేశించే విశ్వక్సేన్ ఆ కామెంట్స్ చేసారని కొంతమంది అనుకుంటున్నారు.

అయితే ఒకప్పుడు నన్ను ఎవరు లేపాల్సిన అవసరం లేదు అన్నావు. మరి ఇప్పుడు నిన్ను లేపడానికి మహేష్ బాబు రాజమౌళి కావాలా అంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు