Viswak Sen : నా డ్రీమ్ రోల్ నా నెక్స్ట్ సినిమాలో వస్తుంది

వెళ్ళిపోమాకే అనే సినిమాతో దినేష్ నాయుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు విశ్వక్సేన్. ఆ సినిమా తర్వాత విశ్వక్సేన్ తన పేరుని మార్చుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఒక జ్యోతిష్కుడు చెప్పిన మాటలు వలన విశ్వక్సేన్ అనేది కలిసి వస్తుందని ఆ పేరును పెట్టుకున్నాడు విశ్వక్. అయితే ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో మళ్లీ లీడ్ రోల్ లో కనిపించాడు విశ్వక్సేన్.

తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయాన్ని సాధించింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సినిమాగా వచ్చి పెద్ద సంచలనాన్ని సృష్టించింది ఆ సినిమా. అటువంటి సూపర్ హిట్ సినిమా తర్వాత తరుణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి.

అయితే ఈ నగరానికి ఏమైంది అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఆ సినిమాలో వివేక్ పాత్రలో కనిపించిన విశ్వక్సేన్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ సినిమాతోనే విశ్వక్ మంచి హీరోగా తన పేరును నిలబెట్టుకున్నాడు అని కూడా చెప్పొచ్చు. అయితే ఆ సినిమా తర్వాత విశ్వక్ తనలోని మరో యాంగిల్ ని బయటికి తీసి ఫలక్నామా దాస్ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు.

- Advertisement -

మలయాళం లో హిట్ అయిన అంగమలై డైరీస్ అనే సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు విశ్వక్. ఈ సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ ని కూడా అందుకున్నాడు విశ్వక్సేన్. అయితే ఆ తర్వాత విశ్వక్సేన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు.

ఇక ప్రస్తుతం విశ్వక్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఆ సినిమాలో మంచి కంటెంట్ ఉంది అని చాలామంది ప్రేక్షకులు నమ్మి థియేటర్ కి వస్తున్నారు. రీసెంట్ గా గామి అనే సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు విశ్వక్సేన్. ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ నేడు నిర్వహించారు. దీనిలో కొన్ని ప్రశ్నలు విశ్వక్సేన్ కి ఎదురయ్యాయి.

కొందరు విశ్వక్సేన్ ను మీకు డ్రీమ్ రోల్ ఏంటి అని అడిగినప్పుడు. విశ్వక్సేన్ నా డ్రీమ్ రోల్ నేను నెక్స్ట్ చేస్తున్న సినిమాలో వస్తుంది. ఆ సినిమా మే లో రిలీజ్ కానుంది. ఆ సినిమా పేరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇది ఒక కమర్షియల్ సినిమా అయినా కూడా దీనిలో ఒక రకమైన సందేశం ఉంటుంది. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలోనే నా డ్రీమ్ రోల్ ని ఫుల్ ఫీల్ చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు విశ్వక్సేన్. అయితే ఈ సినిమాని కృష్ణ చైతన్య తెరకెక్కించాడు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు