Priya Atlee: స్టోరీ డిస్కషన్ లీక్

స్టార్ డైరెక్టర్ ఇండియన్ జేమ్స్ కెమెరాన్ శంకర్ దగ్గర స్నేహితుడు అనే సినిమాకి పనిచేశాడు అట్లీ. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన త్రీ ఇడియట్స్ సినిమాకి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో విజయ్, జీవా, శ్రీరాం ముగ్గురు కలిసి కీలకపాత్రలో కనిపించారు. ఇకపోతే ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకి విజయ్ పరిచయమైన సినిమా ఇది.

ఈ సినిమా కూడా తెలుగు మరియు తమిళ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే విజయ్ తర్వాత సినిమాలు కూడా తెలుగులో డబ్ అవడం మొదలయ్యాయి. అయితే ఆ తర్వాత విజయ్ చేసిన చాలా సినిమాలు ఇక్కడ విజయాన్ని సాధించాయి.

ఇకపోతే అట్లీ ఇప్పటివరకు తన కెరియర్లో ఐదు సినిమాలను డైరెక్షన్ చేశాడు. రాజా రాణి సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అట్లీ. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. వాస్తవానికి ఈ సినిమాని తెలుగు హీరో నాని చేయాలి. కానీ కొన్ని డేట్స్ కుదరని కారణంగా ఈ ప్రాజెక్టు కాస్త ఆర్య చేతికి వెళ్లిపోయింది. అయితే ఈ సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ అయి మంచి ఘనవిజయాన్ని సాధించింది.

- Advertisement -

రాజా రాణి సినిమా తర్వాత అట్లీ వరుసగా మూడు సినిమాలను విజయ్ తో చేశాడు. అట్లీ దర్శకత్వంలో విజయ్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యాయి. ప్రతి సినిమా కూడా ఒక దానిని మించి ఒకటి ఉంటుందని చెప్పవచ్చు. అయితే మూడు కూడా ఇళయ దళపతి విజయ్ హిట్స్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు.

ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా అట్లీ దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. కింగ్ ఖాన్ షారుక్ తో జవాన్ అనే సినిమా తీసి అద్భుతమైన హిట్ ను సొంతం చేసుకున్నాడు అట్లీ. జవాన్ సినిమా సాధించిన విజయం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 1000 కోట్ల వరకు వసూలు చేసింది జవాన్ సినిమా.

ఇక తన కెరియర్ లో మొత్తం ఇప్పటివరకు ఐదు సినిమాలను పూర్తి చేసుకున్న అట్లీ. ఇప్పుడు ఆరువ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అట్లీ దర్శకత్వం వహించే ఆరువ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

ఇకపోతే అట్లీ ఆరువ సినిమా యొక్క స్టోరీ డిస్కషన్స్ ఆల్రెడీ మొదలుపెట్టాడు. తన యొక్క టీం తో కూర్చొని అట్లీ ఇంట్లోనే ఈ డిస్కషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ డిస్కషన్ వీడియోని స్వయాన అట్లీ భార్య ప్రియా అట్లీ ఇంస్టాగ్రామ్ వేదిక షేర్ చేశారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు