Gaami : వీకెండ్ రచ్చ కానీ.. ఇంకా కావాలి?

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా గామి మహాశివరాత్రి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఫాంటసీ కథని జోడించి తీసిన ఈ సినిమా మంచి టాక్ తో పాటు సాలిడ్ ఓపెనింగ్స్ ని కూడా దక్కించుకుంది. దర్శకుడు విద్యాధర్ ఆరేళ్ళ పాటు కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించానని చెప్పడం జరిగింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర సినిమాల పోటీ ఉన్నా కూడా దీనికే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఆడియన్స్ కూడా ఈ సినిమా చూడ్దనికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఇక గామి రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా వీకెండ్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది.

ఒక ఎక్స్ పెరిమెంటల్ మూవీనే అయినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపగా ఓవరాల్ గా మాత్రం మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ మరీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో గ్రోత్ ను సొంతం చేసుకోలేక పోయింది. అయితే 1.8 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా మొత్తం మీద కొంచం డ్రాప్ అయిన గామి 1.46 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.91 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

అన్ని ఏరియాల్లో రచ్చ..

- Advertisement -

గామి సినిమా టోటల్ గా సినిమా వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని ఏరియా వారీగా గమనిస్తే…నైజాం లో 2.99Cr, సీడెడ్ లో 85L, ఆంధ్ర 2.15Cr కలిపి తెలుగు రాష్ట్రాల్లో 6.11CR 11.25CR గ్రాస్ ని వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 0.70Cr, ఓవర్సీస్ లో 2.00Cr వసూలు చేసిన గామి టోటల్ గా వీకెండ్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా 8.81CR షేర్ 16.75 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే మూడో రోజు కొంచం అంచనాలను అందుకోలేక పోయిన సినిమా 11 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా, వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి.

ఇదిలా ఉండగా గామి సినిమా ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అయిపోయి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా గా నిలిచింది. గామి తో పాటు రిలీజ్ అయిన ఇతర సినిమాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ సినిమాకి అది ప్లస్ పాయింట్ అయింది. ఇక గామి మొదటివారం ముగిసేసరికి 25 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటొచ్చని అంచనా.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు