Lifestyle: ఇలాంటి లక్షణాలు ఉండే అమ్మాయిలు హైలీ ఇండిపెండెంట్

అమ్మాయిలు గతంలోలా లేరు. ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా బాగా చదువుకుని, తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. ఎవ్వరిపై ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా తమకు నచ్చిన విధంగా జీవితాలను గడిపేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా సహజంగా పుట్టుకతోనే వస్తుంది. అయితే స్వతంత్రంగా, ఎవ్వరిపై ఆధార పడడం ఇష్టం లేని అమ్మాయిలు తరచుగా కనబరిచే బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. సైకాలజీ ప్రకారం తమకు తెలియకుండానే ఈ హైలీ ఇండిపెండెంట్ ఉమెన్ ఆ లక్షణాలను కనబరుస్తారట. మరి ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి అనే వివరాల్లోకి వెళితే…

1. బౌండరీస్ సెట్ చేయడం
హైలీ ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ రిలయంట్ గా ఉండే అమ్మాయిలు తమ మానసిక, భావోద్వేగ శ్రేయస్సుకే ఎక్కువగా విలువనిస్తారు. అందుకే వాళ్ళు తమ కెరీర్, రిలేషన్, కుటుంబానికి సంబంధించి స్పష్టమైన సరిహద్దులను పెట్టుకుంటారు. దేనికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాము అనే విషయంపై క్లారిటీ ఉంటుంది కాబట్టి దానిపైన ఎక్కువగా ఫోకస్ పెడతారు. అయితే ముఖ్యంగా తమ మానసిక ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే విధంగా ఏదీ ఉండకూడదని అనుకుంటారు. ఒత్తిడి, ఆందోళన, ఓవర్ లోడ్ వంటివి తీసుకోవడానికి ఇష్టపడరు. వారి సామర్థ్యం ఏంటో వాళ్లకు తెలుసు కాబట్టి ఒకవేళ చేయలేము అనుకుంటే నో చెప్పడానికి భయపడరు. ఇలా స్పష్టమైన బౌండరీస్ ను సెట్ చేయడం అనేది వారి సామర్థ్యం, ఇండిపెండెన్స్ ను ప్రతిబింబించే ఒక ప్రవర్తన.

2. అభిప్రాయాలను చెప్పడానికి భయపడరు
ఇండిపెండెంట్ గా ఉండే అమ్మాయిలు తమ అభిప్రాయాలను బయటకు చెప్పడానికి అస్సలు భయపడరు. అది ఫ్యామిలీకి సంబంధించిన విషయమైనా, లేదంటే ఆఫీసులో మీటింగ్ లో అయినా సరే.. వాళ్ల కాన్ఫిడెన్సే వాళ్లని ముందుకు తీసుకెళ్తుంది. దానివల్ల కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అందుకే ఎలాంటి సందర్భంలోనైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి భయపడరు.

- Advertisement -

3. మార్పుకు సిద్ధమే
హైలీ ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ ఉమెన్ మార్పుకు రెడీగా ఉంటారు. ప్లాన్స్ అకస్మాత్తుగా మారినప్పటికీ వాళ్ళు అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. ఇబ్బందికర పరిస్థితులను కూడా సులభంగా నావిగేట్ చేయడంలో వాళ్ళు కంఫర్ట్ గా ఉంటారు. ఎందుకంటే ఎలాంటి సహాయం లేకుండా సవాళ్లను పరిష్కరించడానికి వాళ్ల ఇన్ట్యూషన్ అండ్ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడతారు కాబట్టి. అందుకే నిరాశలను పక్కన పెట్టి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడానికి ప్రాధాన్యతను ఇస్తారు.

4. డెసిషన్ తీసుకోవడంలో నమ్మకం…
ఇక ఇండిపెండెంట్ ఉమెన్ లో ఉండే మరో ముఖ్యమైన అలవాటు ఏమిటంటే నమ్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దగా ఒత్తిడి లేకుండా ఉండే వాతావరణంలో ఎవరైనా ఈజీగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కానీ ఈ ఇండిపెండెంట్ ఉమెన్ క్యాటగిరీలో ఉండే వాళ్ళు మాత్రం ఎలాంటి కఠినమైన సిచువేషన్ లో అయినా టక్కున సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్లకు తాను తీసుకునే నిర్ణయాలను అంత స్ట్రాంగ్ గా నమ్ముతారు.

5. ఏకాంతంగా ఉండడానికే ఇష్టపడతారు
ఇండిపెండెంట్ గా ఉండే మహిళలు ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. అంటే స్నేహితులను కలవడానికి నో చెప్పడం కాదు. కానీ తమ కోసం టైం స్పెండ్ చేయాలి అనుకుంటే స్నేహితులతో సమావేశానికి వచ్చే ఇన్విటేషన్ ను తిరస్కరించడానికి కూడా వెనకాడరు. అన్నింటికంటే సొంత పనులు చేసుకోవడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సినిమా చూస్తున్నా, రెస్టారెంట్లో భోజనం చేసినా, పార్క్ లో కూర్చున్నా, ఒంటరిగా ఉండటం వాళ్లకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇదే వాళ్ళ సెల్ఫ్ రిలయంట్ అండ్ ఇండిపెండెన్స్ కు బలమైన ప్రతిబింబం లాంటిది. వాళ్లు బయటకు వెళ్లి ఏవైనా పనులు చేసేముందు వేరొకరి గురించి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు స్నేహితులకు ప్రాధాన్యతనిచ్చి వాళ్లను సంతోష పెట్టడం గురించి టెన్షన్ పడక్కర్లేదు. కోరుకున్నప్పుడు ఇష్టం వచ్చింది చేయగలుగుతారు. మరి మీలో కూడా ఈ ఐదు లక్షణాలు ఉన్నాయా?

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు