Personality Development : అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి హార్డ్ గా ట్రై చేసే అబ్బాయిలు ఇలా చేస్తారట

ఒక అబ్బాయి అమ్మాయిని అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి పిచ్చి పనులు చేయడానికి అయినా రెడీ అవుతాడు. ముఖ్యంగా తనకు నచ్చిన అమ్మాయి చుట్టూనే ఉండడానికి ట్రై చేస్తారు. వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఇష్టమైన అమ్మాయి ముందు తన ప్రేమను బయట పెట్టడానికి తనను తానే ఫూల్ ను కూడా చేసుకుంటాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ సైకాలజీ ప్రకారం అమ్మాయిని పడగొట్టడానికి హార్డ్ గా ట్రై చేసే అబ్బాయి ప్రవర్తన ఒకరకంగా ఉంటుంది. మరి ఇంతకీ నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి కష్టపడే అబ్బాయిల్లో కనిపించే సైకలాజికల్ లక్షణాలు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

1. బ్యాడ్ జోక్స్ కి కూడా పడి పడి నవ్వడం
తనకు నచ్చిన అమ్మాయి ఎలాంటి పనికిమాలిన జోక్ వేసినా అబ్బాయి గట్టిగా నవ్వేస్తాడు. తమాషా ఏమిటంటే అది మిగతా వాళ్ళు ఎవరికీ అసలు జోక్ లాగా కూడా అనిపించదు. అయితే అమ్మాయి జోక్ కి అబ్బాయి ఇలా పడి పడి నవ్వేస్తున్నాడు అంటే ఇద్దరూ ఒకే వేవ్ లెన్త్ లో ఉన్నారన్నమాట.

2. కళ్ళు మాట్లాడతాయి
ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డప్పుడు కళ్ళు కూడా మాట్లాడతాయి. నీ చూపులు నా వీపుకి గుచ్చుకుంటున్నాయి అని పోకిరి సినిమాలో మహేష్ బాబుతో ఇలియానా చెప్పినట్టుగా రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంది. అబ్బాయిలు తననే చూస్తున్నట్టు ఆ అమ్మాయికి అర్థమవుతుంది.

- Advertisement -

3. ప్రతి మాటకు తల ఊపడం
అమ్మాయి ఏదైనా ఇంప్రెస్సివ్ గా చెప్పకపోయినా ఆమె మేధావి అన్నట్టుగా అబ్బాయి తల ఊపుతూ బిల్డప్ కొడుతున్నాడు అంటే అతనికి ఆ అమ్మాయిపై పిచ్చి ఇష్టం ఉన్నట్టే. కొన్నిసార్లు అతనితో మాట్లాడటం అమ్మాయికి కూడా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే తాను చెప్పేది అతను మనస్ఫూర్తిగా వింటాడు కాబట్టి. ఇక అలాంటి అబ్బాయి తగిలితే అమ్మాయిలు అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే మీరు ఇష్టం అని తెలియజేయడానికి ఆయన తనవంతు ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడు. మీరు చెప్పే ప్రతి మాటను మనస్ఫూర్తిగా వింటున్నాడు. ఇలాంటి అబ్బాయిలు దొరకడం అరుదు కాబట్టి.

4. పర్ఫ్యూమ్ పలకరింపు
అబ్బాయి కిలోమీటర్ దూరంలో ఉన్నా పర్ఫ్యూమ్ స్మెల్ ద్వారా అతని రాకను పసిగట్టగలుగుతున్నారు అంటే ఆ అబ్బాయి తనకి ఇష్టమైన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి హార్డ్ గా ట్రై చేస్తున్నాడు అని అర్థం. పెర్ఫ్యూమ్ తో అమ్మాయి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నట్టు.

5. ప్రతిదానికి ఎస్ చెప్పడం
చెప్పిన ప్రతి పనికి అతను ఎస్ చెప్తున్నాడు అంటే ఆ అబ్బాయి గురించి అమ్మాయి ఆలోచించాల్సిందే. తనకు ఇష్టమైన అమ్మాయి ఏం అడిగినా చేయడానికి రెడీగా ఉంటాడు అబ్బాయి. కాఫీ కొని ఇవ్వమని లేదా డాన్స్ చేయమని, మీ గ్యారేజీని శుభ్రం చేయడానికి హెల్ప్ చేయమని అడిగినా నో మాత్రం చెప్పడు. అమ్మాయి పదిసార్లు పది విషయాల్లో హెల్ప్ అడిగితే దాదాపు 9సార్లు ఎస్ అనే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే తనకు నచ్చిన అమ్మాయి కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు.

6. హీరోలా ప్రవర్తించడం
అబ్బాయి తనకు నచ్చిన అమ్మాయి విషయంలో ఎలాంటి ఆపద రాకుండా, ఆమె ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకుంటాడు. ముఖ్యంగా ఆమె ఏదైనా డేంజర్ లో ఉందేమో అనిపించినప్పుడు క్షేమంగా ఉందని తెలుసుకునే వరకు నిద్రపోడు, రిస్క్ తీసుకోవడానికి కూడా వెనకాడరు.

7. సక్సెస్ గురించి మాటలు
అబ్బాయి ఇష్టమైన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేటప్పుడు… అందులో భాగంగానే తన సక్సెస్ గురించి పంచుకోవడానికి ఇష్టపడతాడు. అయితే ఇలా డైరెక్ట్ గా చేయకుండా నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళ విజయాల గురించి అడిగి, ఆ తర్వాత తన గురించి చెప్పడానికి ట్రై చేస్తాడు.

8. సినిమాలు, స్నేహితులు
రిలేషన్ ఏర్పరచుకోవడానికి తహతహలాడే అబ్బాయిలు తనకు నచ్చిన అమ్మాయికి ఇష్టమైన సినిమాలను చూస్తాడు. తన ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తాడు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆ అమ్మాయిని ఫాలో అవుతూ, ఆమెకు ఇష్టమైన విషయాల గురించే పోస్ట్ చేస్తూ ఉంటాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు