Gaami: ప్రయోగం ఫలించింది

చాలామంది సినిమా దర్శక నిర్మాతలు ఒక సినిమాను ప్రమోట్ చేసినప్పుడు ఈ సినిమా కోసం మేము ప్రాణం పెట్టాం. ఈ సినిమా కోసం జీవితం పెట్టాం. చాలా కష్టపడ్డాం. అని చెప్తూ ఉంటారు. అయితే కొన్ని సినిమాలకి నిజంగానే ప్రాణం పెట్టి చేస్తారు అని చెప్పొచ్చు. కొన్ని సినిమాల్ని కొన్ని సంవత్సరాలు తరబడి చెక్కుతుంటారు కొంతమంది దర్శకులు. అయితే రీసెంట్ టైమ్స్ లో అలా దాదాపు గత ఆరేళ్లగా తెరకెక్కిన సినిమా గామి.

దాదాపు ఆరేళ్ల క్రితం మొదలైన ఈ గామి సినిమా రీసెంట్గా మార్చి 8న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ ఎక్స్పరిమెంటల్ ఫిల్మ్ పైన అందరికీ ఒక రకమైన నమ్మకం ఉంది. కానీ ఎక్కడో ఒక మూలన సినిమా ఫలితం తేడా కొడితే ఏంటి పరిస్థితి అని చాలామంది ఆలోచించారు. ఇకపోతే ఈ సినిమా వెనక కష్టం మామూలుది కాదు. ఒక సినిమా కోసం ఆరేళ్లు కష్టపడటం అంటే అది చిన్న విషయం కాదు. ఎట్టకేలకు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని నమోదు చేసుకుంది అని చెప్పొచ్చు.

ఈ సినిమా విజువల్ గా బాగుందని, సౌండింగ్ అదిరిపోయిందని విశ్వక్సేన్ బాగా నటించాడని కొద్దిపాటి పాజిటివ్ రెస్పాన్స్ ముందు వచ్చింది. అయితే ఇదే సినిమాకు అక్కడక్కడ నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. అయితే మొత్తానికి ఆ నెగిటివ్ టాక్ ని పాజిటివ్ టాక్ డామినేట్ చేసి సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది ఈ సినిమా. అయితే ఈ సినిమా ఇప్పుడు ప్రాఫిట్ జోన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -

వెళ్ళిపోమాకే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు విశ్వక్సేన్. ఆ సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత తనలో ఉన్న దర్శకుడు టాలెంట్ ని కూడా బయటికి తీశాడు ఫలక్ నామా దాస్ అనే సినిమాతో. ఆ సినిమా కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ సాధించి విశ్వక్ మంచి పేరుని తీసుకొచ్చింది.

ఆ తర్వాత విభిన్నమైన కథల్ని ఎన్నుకుంటూ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు విశ్వక్సేన్. అయితే విశ్వక్సేన్ చేసిన ప్రతి సినిమా కూడా కొత్తగా ఉంటుంది అనే ఒక ఒపీనియన్ ని ప్రేక్షకులు మనసులో క్రియేట్ చేశాడు. ఈ సినిమాలతో పాటు గామి సినిమా కోసం గత నాలుగేళ్లుగా కష్టపడుతూ ఉన్నాడు విశ్వక్సేన్. ఈ సినిమాని ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేశారన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఎన్నో ఇబ్బందులకు గురై ఈ సినిమాని పూర్తి చేశాడు విశ్వక్.

ఈ సినిమాకి సంబంధించి విశ్వక్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని కథనాలు వచ్చాయి. అయితే యాక్టింగ్ పైన ఎంత ప్యాషన్ ఉంటే అంత కష్టపడతారు అనడానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఒక దర్శకుడు కూడా విశ్వక్సేన్ లో ఉన్నాడు కాబట్టి ఒక దర్శకుడు ఆలోచనను తను కూడా అర్థం చేసుకొని ఈ సినిమాలో నటించాడని చెప్పొచ్చు. ఏదేమైనా కొన్ని ఏళ్ల తరబడి తెరకెక్కిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతుంటాయి. కానీ ఈ ప్రయోగం మాత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది అని చెప్పొచ్చు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు