Hanu Raghavapudi : సీత గారికి మరో అవకాశం

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హను. అయితే ఆ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద సరైన స్కోర్ చేయకపోయినా కూడా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఇది ఒక మణిరత్నం కైండ్ ఆఫ్ సినిమాల ఉంది. ఒక లైబ్రరీలో కూర్చొని అద్భుతమైన పుస్తకాన్ని చదివిన ఫీలింగ్ ఈ సినిమాతో వచ్చిందని పలు ప్రశంసలు ఆ సినిమాకి లభించాయి.

ఆ సినిమా తర్వాత దాదాపు ఒక నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని నానితో కృష్ణగాడి వీర ప్రేమ గాధ అనే సినిమాను తెరకెక్కించాడు హను. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి హిట్ అయింది. నానికి కూడా మంచి పేరుని తీసుకొచ్చింది ఈ సినిమా. ఈ సినిమాని హను డీల్ చేసిన విధానం. నానిని చూపించిన విధానం. ఆ కథ, కథనం అన్నీ కూడా చాలా కొత్తగా అనిపించి ఆడియన్స్ ని సప్రైజ్ చేశాయని చెప్పొచ్చు.

కృష్ణ గాడి వీర ప్రేమ కథ సినిమా తర్వాత హను దర్శకత్వం వహించిన సినిమా లై. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాతో హనుకి మంచి పేరు అయితే లభించింది. నితిన్ ను చాలా బాగా చూపించాడు అంటూ ప్రశంసలు పొందుకున్నాడు.

- Advertisement -

లై సినిమా తర్వాత హను దర్శకత్వం వహించిన సినిమా పడి పడి లేచే మనసు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ కాలేదు. కానీ ఈ సినిమాతో హను కి మంచి పేరు మాత్రం వచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో శర్వానంద్, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీని అద్భుతంగా చూపించాడు. అంతకుమించి ఈ సినిమా విజువల్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు.

ఇకపోతే ఈ సినిమా తర్వాత హను దర్శకత్వం వహించిన సినిమా సీతారామం. హను కెరియర్లో టాప్ మోస్ట్ బెస్ట్ ఫిల్మ్ అంటే సీతారామం అని చెప్పొచ్చు. అయితే ప్రతి సినిమా విషయంలో సెకండ్ హాఫ్ లో తడబడే హను, ఈ సినిమాను మాత్రం సెకండ్ ఆఫ్ ని పర్ఫెక్ట్ గా రాసుకొని ఇండస్ట్రీకి ఒక బ్లాక్ బస్టర్ క్లాసికల్ లవ్ స్టోరీని అందించాడు. దాదాపు మృణాల్ కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో ఈ సినిమాతో ఒక అద్భుతమైన హిట్ సినిమాను మృణాల్ కు కూడా అందించాడు హను.

ఇకపోతే హను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాను చేయబోతున్నట్లు తెలిసిందే. ఈ సినిమాకి ప్రభాస్ సరసన హీరోయిన్ వెతికే పనిలో పడ్డారు చిత్ర యూనిట్. అయితే ప్రభాస్ సరసన మరోసారి మృణాల్ ను పెట్టి సినిమా చేయాలని అనుకుంటున్నాడట హను. అయితే సీతారామం సినిమాలో సీత క్యారెక్టర్ తో ఒక మంచి గుర్తింపుని ఇచ్చిన హను ఈ సినిమాతో సీతకి మరోసారి అవకాశం ఇవ్వనన్నట్లు తెలుస్తోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు