Kiara advani : స్టన్నింగ్ గ్లామర్ తో కియారా రచ్చ..

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఎక్కడా తగ్గడం లేదు. వరుస సినిమాలు చేస్తూనే, ఫోటోషూట్లలో హాట్ ఫోజులిస్తూ కుర్రకారుకు కిక్కెక్కిస్తోంది. బాలీవుడ్ కి చెందిన గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ ముందుగా ఆఫర్లు మాత్రం టాలీవుడ్ లో అందుకుంది. బాలీవుడ్ మూవీ ఎమ్మెస్ ధోని తో పరిచయమైనా, స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చింది మాత్రం టాలీవుడ్ లోనే. ముందుగా మహేష్ తో, ఆ తర్వాత చరణ్ తో సినిమాలు చేసి ఫేమ్ సాధించింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తో మళ్ళీ గేమ్ ఛేంజర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక కియారా బాలీవుడ్ లో కూడా చాలా తక్కువ టైంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది. కెరీర్ మొదట్లోనే ఈ బ్యూటీ చాలా ముందుచూపు తో సినిమాలు చేసింది. ఒకవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూనే, మరొకవైపు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంది.

అయితే టాలీవుడ్ సినిమాల్లో కియారా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కూడా మంచి క్రేజ్ అయితే దక్కింది. కియారా హీరోయిన్ గా నటించిన వినయ విధేయ రామ అంతగా ఆడకపోయినా కియారా గ్లామర్ కి ఆడియన్స్ పడిపోయారు. ఆ క్రేజ్ వల్లే అమ్మడికి మరోసారి రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ లో నటించే అవకాశం దొరికింది. ఇక బాలీవుడ్ లో అయితే కియారా అద్వానీ ప్రస్తుతం టాప్ రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరిగా అవకాశాలు అందుకుంటుంది. అక్కడ ఆల్మోస్ట్ కియారా 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు టాక్.

స్టన్నింగ్ ఫోటోషూట్స్ తో కట్టిపడేసింది..

- Advertisement -

అయితే కొంత కాలంగా కియారా చేస్తున్న ఫోటోషూట్లు ఇంస్టాగ్రామ్ లో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు ఎక్కడ కనిపించినా కూడా తన గ్లామర్ తోనే ఎట్రాక్ట్ చేస్తుంది. ఇక కియారా డ్రెస్సింగ్ స్టైల్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. తాజాగా కియారా స్టైలిష్ మెరూన్ కలర్ గౌనులో జీ సినిమా అవార్డ్స్ లో చాలా ఘాటుగా దర్శనమిచ్చింది. పక్కన ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నా కూడా అక్కడ ఫోటోగ్రాఫర్ల ఫోకస్ మొత్తం కియారా అద్వానీపైనే పడిపోతుందంటే అర్ధం చేసుకోవచ్చు. ఇక కియారా ఎద అందాలతో చేసిన ఫోటోషూట్స్ కి కూడా అదే రేంజ్ లక్షల్లో లైకులు, షేర్లు వచ్చిపడుతున్నాయి.

ఇకపోతే కియారా నుంచి రెగ్యులర్ గా రాకపోయినా, తన గ్లామర్ తో మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో కనిపిస్తూనే ఉంటుంది. ఇక ఈ బ్యూటీ సిద్ధార్థ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకునే విషయం తెలిసిందే. చాలా కాలం పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట చివరికి డెస్టినేషన్ వెడ్డింగ్ తో షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు సినిమా కెరీర్ ను కూడా సమానంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కియారా గేమ్ ఛేంజర్ తో పాటు వార్ 2 లో కూడా హీరోయిన్ గా కనిపించబోతోంది. అలాగే బాలీవుడ్ లో మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు