Sundeep Kishan: క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో సందీప్ కిషన్ ఒకడు. ముందుగా స్నేహగీతం, ప్రస్థానం అలాంటి సినిమాల్లో కీలకపాత్రలో కనిపించాడు సందీప్ కిషన్. ఆ తర్వాత సందీప్ కిషన్ చేసిన రొటీన్ లవ్ స్టోరీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వంటి సినిమాలు సందీప్ కిషన్ కి మంచి హిట్ గా నిలిచి ఒక గుర్తింపును తీసుకొచ్చాయి.

అయితే సందీప్ కిషన్ ఎప్పుడూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ముందు ఉంటాడని చెప్పొచ్చు. ఇదివరకే చాలా సినిమాలను కొత్త దర్శకులతో చేశాడు సందీప్ కిషన్. వాస్తవానికి సందీప్ రెడ్డి వంగ కూడా సందీప్ కిషన్ తో అర్జున్ రెడ్డి సినిమాను చేయాల్సి ఉంది. వీరిద్దరూ కలిసి కొంతకాలం ట్రావెల్ కూడా అయ్యారు. అయితే అప్పటికే ప్రస్థానం సినిమాలో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయడంతో మళ్లీ సందీప్ కిషన్ కి అది ఎందుకో వర్కౌట్ కాదని చెప్పి దానిని రిజెక్ట్ చేశాడు. ఆ సినిమా అర్జున్ రెడ్డి అయి బ్లాక్ బస్టర్ గా మారింది.

ఇకపోతే నగరం సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్ కనకరాజ్. లోకేష్ కనకరాజ్ ను గుర్తించి తనకంటూ ఒక అవకాశం ఇచ్చి ఒక దర్శకుడుగా నిలబెట్టాడు సందీప్ కిషన్. ఇప్పటికీ లోకేష్ కనకరాజ్ కి, సందీప్ కిషన్ కి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. సందీప్ కిషన్ నటించిన మైఖేల్ సినిమాని తమిళ్లో లోకేష్ కనకరాజ్ ప్రజెంట్ చేశారు.

- Advertisement -

రీసెంట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు కూడా మొదటి సందీప్ కిషన్ తో రారా కృష్ణయ్య అనే సినిమాను చేశాడు. ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. అయితే ఇలా ఎంతోమంది కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేశాడు సందీప్ కిషన్. ఇక రీసెంట్ గా ఊరు పేరు భైరవకోన సినిమాతో మంచి హిట్ ను తన సొంతం చేసుకున్నాడు సందీప్.

ఇక సందీప్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. సందీప్ తర్వాత త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్రినాధరావు నక్కిన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను చేసిన సినిమాలు అన్నీ కూడా సేఫ్ జోన్ లో ఆడి మినిమమ్ మార్కెట్ ను సాధించాయి. రీసెంట్ గా వచ్చిన ధమాకా సినిమా అయితే దాదాపు 100 కోట్లను వసూలు చేసి రవితేజ కెరియర్ లో మంచి ప్లస్ అయింది.

త్రినాధరావు నక్కిన సినిమాతో పాటు స్వరూప్ దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో స్వరూప్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే తనకంటూ మంచి పేరు సాధించుకున్నాడు. ఆ తరవాత తాప్సి హీరోహిన్ గా మిషన్ ఇంపాజిబుల్ అనే సినిమాను చేశాడు స్వరూప్. ఆ సినిమా కూడా స్వరూప్ కి మంచి పేరును తీసుకొచ్చింది. ఇప్పుడు సందీప్ కిషన్ తో స్వరూప్ సినిమా చేస్తున్నాడంటే ఎటువంటి సబ్జెక్టు ఎంచుకుంటాడని కొద్దిపాటి క్యూరియాసిటీ అందరికీ మొదలైంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు