Orange: మళ్లీ కన్సర్ట్ స్టార్ట్

చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. అయితే మొదటి సినిమాతోనే చిరు తనయుడు అనిపించుకున్నాడు. చిరుత సినిమాలో రాంచరణ్ ఇచ్చిన పర్ఫామెన్స్ కి చాలామంది ఫిదా అయిపోయారు. డాన్సులు కూడా చిరంజీవిలానే వేస్తున్నాడు. మనకి ప్రస్తుతానికి చిరంజీవి గారు సినిమాలు చేయకపోయినా పర్లేదు ఆ లోటును రామ్ చరణ్ తేజ్ తీరుస్తున్నాడు. అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది.

ఆ సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన సినిమా మగధీర. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది మగధీర సినిమా. ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. రామ్ చరణ్ లోని ప్లస్ పాయింట్స్ అన్నింటిని సినిమాలో ప్రజెంట్ చేసి ఊహించని భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి. ఈ సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి స్థాయి అమాంతం పెరిగిపోయింది. అలానే చరణ్ పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇంకా పెరిగిపోయాయి.

చరణ్ కెరియర్ లో వచ్చిన మూడవ సినిమా ఆరెంజ్. ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమా రిలీజ్ కంటే ముందు ఆ సినిమా సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఆ సాంగ్స్ అప్పట్లో ఒక సంచలనం అని చెప్పొచ్చు ప్రతి ప్లే లిస్ట్ లోని ఇవే సాంగ్స్ ఒక మాత మోగేవి. అంత అద్భుతమైన సంగీతాన్ని అందించాడు హరీష్ జయరాజ్. హరీష్ సంగీతం అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.

- Advertisement -

మగధీర సినిమా తర్వాత ఈ సినిమా రావడంతో పాటు, అద్భుతమైన సాంగ్స్ ఈ సినిమాలో ఉండడం. అలానే బొమ్మరిల్లు భాస్కర్ అప్పటికే ఉన్న హిట్ ట్రాక్. ఈ సినిమాలో చరణ్ తేజ్ లుక్స్. ఇవన్నీ కూడా సినిమా పైన ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేశాయి. కానీ థియేటర్స్ కి వెళ్లిన తరువాత అదంతా తారుమారు అయిపోయింది. మొత్తానికి ఈ సినిమా తుది ఫలితం డిజాస్టర్ గానే మిగిలింది.

అయితే ఈ సినిమాని రీసెంట్ గా రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా రీ రిలీజ్ కి వచ్చిన రెస్పాన్స్ గురించి మాట్లాడితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలామంది ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాని ఒక మ్యూజిక్ కన్సర్ట్ లా సెలబ్రేట్ చేశారు. ఈ సినిమాను మ్యూట్ లో పెడితే సాంగ్స్ అన్ని పాడేసేలా యూత్ క్రేజీగా తయారయ్యారు. రీ రిలీజ్ లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని కూడా వసూలు చేసింది.

అయితే ఈ నెల 27వ తారీఖున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆరెంజ్ సినిమాను మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు నాయక్ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆరెంజ్ సినిమాను కూడా స్పెషల్ షోస్ వేయనున్నట్లు తెలుస్తోంది. చాలామంది ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టి హరీష్ జయరాజ్ కన్సర్ట్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. దానితో పాటు చరణ్ బర్త్ డే ని కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పొచ్చు.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు