Anushka shetty : ఒకప్పటి స్వీటీని చూడబోతున్నామా?

టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా అనుష్క శెట్టికి ఉండే క్రేజ్ వేరని చెప్పాలి. దాదాపుగా రెండు దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఒక్క తెలుగులోనే కాదు అటు తమిళ్ లో కూడా మంచి సినిమాలు చేస్తూ పోయేది అనుష్క. నటనకు ప్రాధాన్యమిస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న అనుష్క కు ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా కూడా అందులో అనుష్కకు ఉన్న క్రేజ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే బాహుబలి లాంటి సక్సెస్ తర్వాత కూడా అనుష్క చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. పైగా గ్లామర్ రోల్స్ ఒక్కటి కూడా చేయడం లేదు. నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ మాత్రమే చేస్తుంది. అది కూడా తన పాత్ర ఇంపార్టెన్స్ ని బట్టే డిసైడ్ అవుతుంది. చివరగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కనిపించిన అనుష్క మళ్ళి సోషల్ మీడియాకి దూరంగా ఉంది.

ఒకే అంటే క్యూ లో నిర్మాతలు..

అనుష్క గత ఐదారేళ్లుగా సినిమాల స్పీడు తగ్గించేసరికి కొత్త హీరోయిన్లు ఆ స్థానాన్ని భర్తీ చేసారని కొందరు నెటిజన్లు భావిస్తారు. కానీ నిజానికి అనుష్క గ్యాప్ తీసుకుంది అంతే. ఒక్కసారి అనుష్క ఓకే చెబితే అడ్వాన్స్ ఇవ్వడానికి ఎంతో మంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అనుష్క కి కథలు చెప్పడానికి కూడా చాలా మంది దర్శకులు లైన్లో ఉన్నారు. అయితే అనుష్క మాత్రం ఇప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలకు పూర్తిగా దూరమవుతోంది. కేవలం డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలే సెలెక్ట్ చేసుకుంటుంది. పాత్ర పెద్దదైనా, చిన్నదైనా అందులో తన పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందొ అని చూస్తున్నారు. అయితే సైజ్ జీరో సినిమా చేసిన తరవాత అనుష్క ఎన్ని సినిమాల్లో కనిపించినా దానికి ముందున్న గ్లామర్ తో కనిపించలేదు. చాలా బొద్దుగా తయారైంది. ఒకప్పటి అందాన్ని కోల్పోయింది అనేలా ఆ మధ్య చాలా రకాల కామెంట్స్ అయితే వచ్చాయి. వాటి కారణంగా కొన్ని ప్లాప్స్ వచ్చినా, మళ్ళీ చాలా గ్యాప్ తీసుకుని నవీన్ పోలిశెట్టితో చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మంచి సక్సెస్ అందుకుంది. అందులో కూడా అనుష్క కాస్త బొద్దుగానే కనిపించింది.

- Advertisement -

ఒకప్పటి అనుష్క లా?

అయితే స్వీటీ ముందులా గా అందంగా ఫిట్ గా కనిపించదా అనే సందేహాలు వస్తున్న టైం లో ఒక తాజా స్టిల్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ స్టిల్ ఒక సినిమా సెట్స్ లో ఉండగా తీసింది. ఆ ఫోటో చూస్తుంటే అనుష్క తదుపరి సినిమాలో చాలా నాజుగ్గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ గా ఆమెకు సంబంధించిన రెండు మూడు స్టిల్స్ లో ఆమె కూడా వైరల్ గా మారాయి. అందులో అనుష్క ఇంతకుముందు సినిమాల కంటే చాలా అందంగా కనిపిస్తోంది. బరువు కూడా తగ్గినట్లు అనిపిస్తోంది. ఇక ఆ స్టిల్స్ విషయానికి వస్తే అనుష్క ప్రస్తుతం అనుష్క ‘కథానర్’ అనే ఒక మలయాళం సినిమా చేస్తోంది. పిరియడ్ ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను మలయాళం దర్శకుడు రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్నాడు.

రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇక సీనియర్ నటుడు వినీత్ కూడా ఇందులో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ లో ఇటీవల పాల్గొన్న అనుష్క దర్శక నిర్మాతలతో కలిసి ఒక ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ఇక చిత్ర యూనిట్ ఆమెకు ప్రత్యేకంగా శ్రీకృష్ణ బొమ్మను కూడా కానుకగా ఇచ్చారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత సెట్స్ పై ఉన్న స్టిల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి అనుష్క చాలా రోజుల తర్వాత మునుపటి అందంతో కనిపిస్తోంది. మరి సినిమాల లైనప్ కూడా స్పీడ్ అవుతుందా? అనుష్క వరుస బెట్టి సినిమాలు చేస్తుందా లేదా అనేది చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు