Venkatesh : ఆ బాలీవుడ్ మూవీపై వెంకీ కన్ను?

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన సినిమాలతో అభిమానులని అలరిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. అయితే విక్టరీ వెంకటేష్ గా పిలిపించుకునే వెంకీ మామ, గత కొన్నాళ్లుగా విక్టరీ అన్న పేరు కంటే రీమేక్ స్టార్ అన్న పేరునే కంటిన్యూ చేస్తున్నాడు. వెంకటేష్ సక్సెస్ ఫుల్ రీమేక్స్ చేయడం లో దిట్ట అయినప్పటికీ రీసెంట్ గా చేసిన కొన్ని సినిమాలు కూడా ప్లాప్ అవడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా ఈ సంక్రాంతికి వచ్చిన సైన్ధవ్ కూడా దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. అందుకే తదుపరి సినిమాలపై గట్టిగా దృష్టి పెట్టాడు. ఇక తనకి అచొచ్చిన ఎంటర్టైన్మెంట్ జోనర్ లో అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అలాగే తాజాగా ఓ బాలీవుడ్ సినిమాపై వెంకటేష్ మనసుపారేసుకున్నాడని తాజాగా వార్తలు వస్తున్నాయి.

సైతాన్ పై వెంకీ కన్ను?

రీసెంట్ గా బాలీవుడ్ లో విడుదలైన సైతాన్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, జ్యోతిక జంటగా మాధవన్ విలన్ గా వచ్చిన ఈ హర్రర్ థ్రిల్లర్ కి ముందు మిక్సడ్ టాక్ వచ్చినా మాంచి స్క్రీన్ ప్లే డ్రామాతో ఆడియన్స్ నుండి మౌత్ టాక్ తెచ్చుకుంది. ఇక రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 55 కోట్ల కి పైగా వసూళ్లు వచ్చాయి. కొన్ని సీటీ ఏరియాల్లో ఆదివారం వీకెండ్ అర్ధరాత్రి షోలు వేయాల్సి వచ్చిందంటే ఏ రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. గుజరాతి బ్లాక్ బస్టర్ ‘వష్’ అనే సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ చేతబడి డ్రామా మూవీ ని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో వెంకటేష్ ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. రీసెంట్ గా ఈ సినిమా స్పెషల్ షో వేయించుకుని మరీ వెంకటేష్ చూసారని, షో చూసిన వెంకీకి కాన్సెప్ట్ బాగా నచ్చిందని సమాచారం.

- Advertisement -

సైతాన్ వద్దని ఫ్యాన్స్ విన్నపం?

అయితే సైతాన్ మూవీని వెంకటేష్ రీమేక్ చేస్తారని వార్తలు వస్తున్నప్పటి నుండి ఆయన అభిమానులు మాత్రం ఈ సినిమా మాత్రం వద్దని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే సైతాన్ సినిమాలో అజయ్ దేవగన్ హీరో అయినప్పటికీ సైతాన్ లో మాధవన్ ది వన్ మ్యాన్ షో అని చెప్పాలి. అయితే పూర్తి నెగటివ్ షేడ్స్ లో ఈ పాత్ర సాగుతుంది. క్లైమాక్స్ లో ఏకంగా భయపెట్టేలా మాధవన్ తన విశ్వరూపం చూపించాడు. ఇక అజయ్ దేవగన్ పాత్ర మాత్రం ఎక్కువ శాతం భయం చూపిస్తూ రెండు మూడు ఎమోషన్స్ మీద అలా నడుస్తుంది. ఆయన పాత్ర తక్కువని కాదు గాని మాధవన్ పాత్రే సినిమాలో హైలెట్ అని చెప్పాలి. దాంతో వెంకీ అభిమానులు మాత్రం ఈ సినిమా వద్దని అంటున్నారు.

ఎందుకంటే ఒకవేళ వెంకటేష్ చేయాలి అనుకుంటే, సైతాన్ లో అజయ్ దేవగన్ పాత్ర ఆయన ఇమేజ్ కి సూట్ కాదు. ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు. పోనీ మాధవన్ క్యారెక్టర్ తీసుకుంటే అంత నెగటివ్ షేడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ అస్సలు ఒప్పుకోరు. అప్పుడెప్పుడో నాగవల్లిలో కాసేపు అలా కనిపిస్తేనే మొహమాటం లేకుండా దెబ్బేసారు. ఒకవేళ మాధవనే ఒప్పుకుంటే తనకొచ్చే ప్రాధాన్యం ముందు వెంకీ స్పేస్ తగ్గిపోతుంది. అజయ్ దేవగన్ రోల్ లాంటిది ఇంతకు ముందు దృశ్యం లో చేసినా ఆ సినిమాలో వెంకీ కి అపోజిట్ గా అంత స్ట్రాంగ్ రోల్ లేదు కాబట్టి, ఆ సినిమాలో వెంకీయే హైలెట్. ఒకవేళ మన నేటివిటీకి తగ్గట్టు సైతాన్ ని మారుద్దామంటే మళ్ళీ ఏదైనా తేడా జరిగితే చెడగొట్టారూ అంటూ విమర్శలు వస్తాయి. అయితే ప్రస్తుతానికి ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. సైతాన్ విషయంలో మాత్రం బాగా ఆలోచిస్తే మంచిదని ఫ్యాన్స్ అభిప్రాయం. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే సంక్రాంతికి వస్తున్నాం, రానా నాయుడు సీజన్ 2 తప్ప వెంకటేష్ అఫీషియల్ గా ఇచ్చిన కమిట్మెంట్లు లేవు. మరి రాబోయే ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయన్న విషయం లో ఆసక్తి నెలకొని ఉంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు