Bhimaa : పస లేదు గాని.. పట్టు తగ్గలేదు!

టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమా మహాశివరాత్రి సందర్బంగా థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత గోపీచంద్ ఒక పక్కా ఆక్షన్ బ్యాక్ డ్రాప్ లో బజ్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా ప్రేక్షకుల నుండి మాత్రం యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే గోపీచంద్ గత సినిమాలను బట్టి ఈ సినిమా కాస్త బెటర్ గా ఉండడంతో వీకెండ్ లో మంచి వసూళ్లు అందుకుంది. అయితే దీనికి పోటీగా గామి, ఇంకా ప్రేమలు రిలీజ్ కావడంతో ఈ సినిమాకి చాలా దెబ్బ పడిందని చెప్పొచ్చు. పైగా ఈ సినిమా ఆక్షన్ సినిమా కావడం వల్ల రొటీన్ గా ఉండడం వల్ల ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవలేదు. అయితే సినిమా టాక్ కొంచం మిక్సుడ్ గా ఉన్నా మంచి కలెక్షన్స్ తోనే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. అయితే వచ్చిన ఓపెనింగ్స్ ని గమనిస్తే ఆడియన్స్ ఈ ఓపెనింగ్స్ ని మంచి కలెక్షన్లు అంటారా అని అనుకోవచ్చు. కానీ గోపీచంద్ గత సినిమాల డిజాస్టలనుబట్టి ఈ సినిమాకి వచ్చిన టాక్ ని బట్టి, అన్నిటికి మించి సినిమాల పోటీని బట్టి బెటర్ ఓపెనింగ్స్ అనే చెప్పొచ్చు.

అలా జరిగుంటే పండగ బ్లాక్ బస్టర్ అయ్యేది..

అయితే గోపీచంద్ గత సినిమాలని బట్టి ఈ సినిమా కి చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా తక్కువే జరిగింది. అయితే టీజర్ ట్రైలర్ ద్వారా కాస్త హైప్ ని తీసుకువచ్చింది ఈ సినిమా. అయితే గోపీచంద్ గత సినిమాల్లో ఫ్యాన్స్ ఏమైతే మిస్ అయ్యారో ఆ మాస్ గోపీచంద్ ని ఈ సినిమాలో చూసిన ఫీలింగ్ కలిగింది. అయితే ఆ రోల్ ని క్లైమాక్స్ లో తప్ప మరెక్కడా వాడలేదు. నిజానికి కన్నడ డైరెక్టర్ అయిన హర్ష ఒక కన్నడ సినిమాలనే ఈ సినిమాని తీసాడని కొందరు నెటిజన్ల అభిప్రాయం. భీమా లో కాస్త డ్రామా కరెక్ట్ గా రాసుకుని స్క్రీన్ ప్లే తొహ్ మ్యాజిక్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద నంబర్లే నమోదయ్యేవని ట్రేడ్ విశ్లేషకుల భావన.

- Advertisement -

ఓపెనింగ్స్ తో సత్తా..

అయితే భీమా సినిమాకి తాజాగా వచ్చిన ఓపెనింగ్స్ తో గోపీచంద్ మాస్ పట్టు ఎలా ఉంటుందో చూపించింది. గోపీచంద్ ఈ మధ్య కాలంలో తన కటౌట్ కి తగ్గ రోల్ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ లో ఉండగా, ఈ సినిమాలో క్లైమాక్స్ కే థియేటర్లలో ఫ్యాన్స్ చేసిన రచ్చ చూసిన వాళ్ళు, గోపీచంద్ మాస్ పట్టుని జడ్జ్ చేయలేరు. ఆయన్లో మాస్ పట్టు ఏమాత్రం తగ్గలేదని భావించొచ్చు. దానికి తగ్గట్టే వీకెండ్ ఓపెనింగ్స్ వచ్చాయి. నిజానికి అది పెద్ద నంబర్లు కాకపోయినా, గోపీచంద్ గత సినిమాలతో పోల్చుకుంటే బెటర్ అని చెప్పాలి. పైగా భీమా కి గామి, ప్రేమలు పోటీ ఉన్నా, బిసి సెంటర్ల ప్రేక్షకులు భీమా ని ఫస్ట్ ఆప్షన్ గా కొన్ని ఏరియాల్లో ప్రేక్షకులు తీసుకున్నారు.

ఇకనైనా జాగ్రత్త వహించాలి..

అయితే గోపీచంద్ భీమా కలెక్షన్లతో వచ్చిన రెస్పాన్స్ తో మూవీ కి ఏ లాభం లేకపోయినా, ఈ మాస్ రెస్పాన్స్ తో గోపీచంద్ తాను ఏం కోల్పోయాడో గ్రహించాలి అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సరైన బొమ్మ పడితే మళ్ళీ గోలీమార్ లాంటి ఒక్క సినిమా పడ్డా నోళ్లు అన్ని మూత పడేలా బాక్స్ ఆఫీస్ సత్తా చాటుతారని ట్రేడ్ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనువైట్లతో సినిమా చేస్తున్న గోపీచంద్ ఆ సినిమాని జులై లేదా ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చూస్తున్నారు. మరి గోపీచంద్ నిఖార్సైన హిట్టు కొట్టేదెన్నడో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు