Dhanush: కుబేర స్టోరీ లైన్ ఇదే

శేఖర్ కమ్ముల తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులకు విభిన్నంగా ఉంటారు. డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శేఖర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కానీ ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమా తర్వాత శేఖర్ దర్శకత్వం వహించిన ఆనంద్.

ఆనంద్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శంకర్ దాదా ఎంబిబిఎస్ అనే మెగాస్టార్ సూపర్ హిట్ సినిమాతో పాటుగా రిలీజ్ అయిన ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఆనంద్ అనే సినిమా రిలీజ్ కంటే ముందు చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమా తెరకెక్కడానికంటే ముందు ఎవరి దగ్గరికి తీసుకెళ్లినా కూడా ఇది చాలా స్లో గా ఉంది. ఇది వర్కవుట్ అవ్వదు అంటూ చాలామంది శేఖర్ కి చాలా చెబుతూ వచ్చారు.

అయితే శేఖర్ అవేవీ నమ్మకుండా తన కథను మాత్రం బలంగా నమ్మి ఆనంద్ సినిమాను తెరకెక్కించాడు. దీనికి ఓ మంచి కాఫీలాంటి సినిమా అని ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామందికి ఇదే ఫీలింగ్ కలిగింది. ఆనంద్ ఒక మంచి కాఫీలాంటి సినిమా అని చాలామంది ఒప్పుకున్నారు. ఆ తర్వాత శేఖర్ చేసిన చాలా సినిమాలు కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

ఇకపోతే శేఖర్ కమ్ముల సినిమాలకి ఫెయిల్యూర్ కంటే కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని చెప్పవచ్చు. తీసిన అన్ని సినిమాలు కూడా మాక్సిమం ప్రేక్షకుల్ని అలరించాయి. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లీడర్ అంచనాలను అందుకోలేదు. అలానే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది.

ఇకపోతే వరుస హిట్ సినిమాలను ఈ మధ్య కాలంలో పొందుకున్నాడు శేఖర్. వరుణ్ తేజ్ హీరోగా చేసిన ఫిదా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇక రీసెంట్ గా నాగచైతన్య హీరోగా చేసిన లవ్ స్టోరీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో కుబేర అనే సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక బెగ్గర్ అనేవాడు ఒక డాన్ గా ఎలా మారాడు అని లైన్ తోనే ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం వినిపిస్తుంది. అయితే ఇటువంటి లైన్ ను శేఖర్ కమ్ముల నుంచి ఎక్స్పెక్ట్ చేయటం అనేది బేసిక్ గా జరగదు. కానీ అందర్నీ సప్రైజ్ చేసేలా ఇటువంటి లైన్ ని సినిమాగా చేసి ఆడియన్స్ ని ఎంతగా అలరిస్తాడో శేఖర్ కమ్ముల తెలియాలి అంటే కుబేర రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు