Skn : రీల్ లైఫ్ నిర్మాత, రియల్ లైఫ్ హీరో

శ్రీనివాస కుమారన్ అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఎస్ కే ఎన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతగా ఈ మధ్య కాలంలో పాపులర్ అయ్యారు ఎస్ కే ఎన్. ఇంకా ఎస్ కే ఎన్ అని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్ని సినిమాలు నిర్మించిన కూడా ఎస్ కే ఎన్ కి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలు అంటే టాక్సీవాలా అండ్ బేబీ అని చెప్పొచ్చు.

రీసెంట్ గా వచ్చిన బేబీ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఒక సినిమాని నమ్మి కొన్ని కోట్లు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒక దర్శకుడి ఆలోచన నమ్మి కొన్ని కోట్లు పెట్టడం అంటే దానిని సాహసం అనే చెప్పాలి. అయితే అలా సాయి రాజేష్ ఆలోచనను నమ్మి కొన్ని కోట్లు పెట్టి బేబీ సినిమాను నిర్మించారు. ఈ బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది.

ముందుగా ఈ సినిమా విషయంలో కొంతమంది నుంచి కొద్దిపాటి నెగిటివ్ ఫీడ్ బ్యాక్స్ వచ్చాయి. కానీ అవన్నీ కూడా రియల్ ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తో డామినేట్ అయిపోయాయి. ఇకపోతే ఈ సినిమా ప్రీమియర్ పడగానే కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టామని చాలా నమ్మకంతో అప్పట్లో చెప్పుకొచ్చారు ఎస్ కే ఎన్.

- Advertisement -

అక్కడితో ఎస్ కే ఎన్ బాగా ఫేమస్ అవుతూ వచ్చారు. అంతకంటే ముందు నుంచే కూడా ఎస్ కే ఎన్ స్టేజ్ పైన మాట్లాడిన తీరు, ట్విట్టర్లో ఫ్యాన్స్ కి ఇచ్చే రిప్లైస్ కూడా ఎస్ కే ఎన్ కి ఒక ఓన్ ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. ఇకపోతే ఏ సినిమా ఫంక్షన్ అయినా కూడా ఎస్ కే ఎన్ తన మాటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.

ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్, బండ్ల గణేష్ లాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు ప్రేక్షకులు ఏ విధంగా కనెక్ట్ అవుతారో ఎస్ కే ఎన్ అని మాట్లాడినా కూడా అలానే కనెక్ట్ అవుతారని చెప్పవచ్చు. పంచులు ప్రాసలు చాలా అలవోకగా మాట్లాడేస్తుంటారు ఎస్ కే ఎన్. ఇకపోతే ఇప్పుడు ఎస్ కే ఎన్ మరోసారి తెరపైకి వచ్చాడు.

అయితే ఇప్పుడు ఎస్ కే ఎన్ మరోసారి చర్చలోకి వచ్చాడు. దీనికి కారణం ఏంటంటే ఎస్ కే ఎన్ ఏ సినిమాకు స్పీచ్ ఇవ్వటం కాదు.రియల్ లైఫ్ లో ఎస్ కే ఎన్ చేసిన ఒక పని వలన అందరూ ఎస్ కే ఎన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రీల్ లైఫ్ లో నిర్మాతగా వ్యవహరించే ఎస్ కే ఎన్ రియల్ లైఫ్ లో తన మానవత్వాన్ని చాటుకున్నారు.

ఇక అసలు విషయానికొస్తే ఒక రోడ్డు ప్రమాదంలో గురైన ఎన్టీఆర్ అభిమాని హాస్పిటల్లో ఉన్నారు. అయితే వారి కుటుంబం పేద కుటుంబం అవడంతో కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసి మన తోటి అభిమానిని సేవ్ చేద్దామని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన ఎస్ కే ఎన్ 50వేల రూపాయలను పంపించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. రియల్ లైఫ్ లో నిర్మాతగా వ్యవహరించే ఎస్ కే ఎన్, రియల్ లైఫ్ లో ఇప్పుడు చాలామందికి హీరోలా కనిపిస్తున్నాడు. ఇంకా సినిమా లాంగ్వేజ్ లో చెప్పాలంటే పైకి కామెడీగా ఆడుతాడు గాని లోపల హ్యుమానిటీ ఎక్కువే.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు