Baby Movie: బేబి సినిమాపై కాపీ రైట్ కేస్… టైటిల్ మార్చారు అంతే..!

Baby Movie

దర్శకులు, ప్రొడ్యూసర్లు ఈ మధ్య కాలంలో కాపీ రైట్ కేసు ఉచ్చులో పడిపోతున్నారు. ఇటీవల కాలంలో శ్రీమంతుడు సినిమా కాపీ రైట్ వివాదం… సుప్రీం కోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసులో డైరెక్టర్ కొరటాల శివకు శిక్ష తప్పదు అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే తీర్పును హై కోర్టు కూడా గతంలో ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సినిమాపై కాపీ రైట్ కేస్ నమోదు అయింది.

ఇటీవల బేబి సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబి… బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కల్ట్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ మూవీతో డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత SKNతో పాటు హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్యకు మంచి గుర్తింపు వచ్చింది. వైష్ణవి చైతన్య అయితే ఒక్క సారిగా యూత్‌కు ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది.

అయితే ఇప్పుడు బేబి మూవీకి షాక్ తగిలింది. ఈ సినిమా స్టోరీ తనది అంటూ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను “ప్రేమించొద్దు” అనే టైటిల్‌తో 2015లో స్టోరీ రాసుకున్నాట్టు, దాన్ని సాయి రాజేష్ కు చూపించినట్టు తెలిపాడు. అలాగే.. కథ బాగుండటంతో సాయి రాజేష్‌తో కలిసి నిర్మాత SKNను కలిసి, తన స్టోరీ వినిపించానని ఫిర్యాదులో చెప్పుకొచ్చాడు. తర్వాత తనను సంప్రదించకుండనే తన కథకు బేబి అనే టైటిల్ పెట్టి సినిమా రిలీజ్ చేశారని వివరించాడు.

- Advertisement -

అయితే ఇప్పుడు ఫిర్యాదుతో ఈ విషయం ఒక్క సారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా, ఇప్పుడు బేబి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ టైంలో సినిమాపై కాపీ రైట్ కేస్ నమోద్ అవ్వడం సినిమాకు పెద్ద మైనస్ అనే చెప్పొచ్చు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు