Saif Ali Khan: నన్ను ఇలాగే చావనివ్వండి.. విడాకులపై స్పందించిన సైఫ్..!

Saif Ali Khan

ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గత ఏడాది ఆదిపురుష్ సినిమాలో లంకేష్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయిన దాదాపు 7 నెలల తర్వాత ఆయన స్పందించి డిజాస్టర్ నుండి ఎలా బయటపడ్డారో వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ లకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తన మొదటి భార్య అమృత సింగ్ కి విడాకులు ఇచ్చినప్పుడు.. తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వెల్లడించారు.

ఇకపోతే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ దక్కించుకున్న జంటలలో సైఫ్ అలీ ఖాన్ – కరీనాకపూర్ జంట కూడా ఒకటి. అయితే కరీనా ను వివాహం చేసుకోవడానికంటే ముందే సైఫ్ అలీ ఖాన్ నటి అమృత సింగ్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. 2005లో ఈ విడాకులపై స్పందించిన సైఫ్ అలీఖాన్ నాటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

అందులో ఆయన మాట్లాడుతూ..”విడాకులు తీసుకున్నప్పుడు నా సోదరిని, నా తల్లిని , నన్ను దుర్భాషలాడి అవమానించారు. మానసికంగా వేధించారు. అన్నిటిని తట్టుకున్నాను. నెమ్మదిగా దాని నుంచి బయటపడి మళ్లీ రోసా తో డేటింగ్ చేశాను. అయితే అలా మేము విడిపోయిన తర్వాత కూడా పిల్లల్ని పట్టించుకోకుండా ఎప్పుడు వదిలేయలేదు. అలానే కస్టడీ కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ అమృత సింగ్ తో పోరాడాలని అనుకోలేదు. అయితే ఎప్పుడు వారికి అండగా మాత్రం ఉన్నాను. విడిపోయినప్పుడు అమృతకు రూ .5కోట్ల భరణం ఇచ్చేందుకు అంగీకరించాను.

- Advertisement -

అలాగే ఇబ్రహీం కి 18 ఏళ్ల వయసు వచ్చేవరకు నెలకు లక్ష రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పాను. నాకు… షారుఖ్ ఖాన్ అంత పెద్ద సంపాదన లేకపోయినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి.. డబ్బులు సమయానికి ఇచ్చేసేవాడిని.. యాడ్స్ ,స్టేజి షోలు, సినిమాల ద్వారా.. వచ్చే ప్రతి పైసాని కూడా నేను వారికే అంకితం చేశాను. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఇలాగే చావనివ్వండి. ఒక బంధం నుంచి ఇంత ఈజీగా వచ్చేసావేంటి అంటూ పదేపదే ఎత్తిపొడుపు మాటలతో నన్ను మరింత పొడిచి చంపకండి.. ప్లీజ్” అంటూ చెప్పుకోచ్చారు సైఫ్ అలీ ఖాన్..

1991లో సైఫ్ అలీఖాన్ అమృత సింగ్ వివాహం చేసుకోగా వీరికి సారా అలీ ఖాన్ , ఇబ్రహీం అలీఖాన్ జన్మించారు.పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన అమృత 2004లో సైఫ్ అలీ ఖాన్ తో విడిపోయి.. మళ్లీ తెరపై బిజీ అయింది.. ఇక సైఫ్ కూడా రోసా తో ప్రేమలో పడి కొంతకాలానికి బ్రేకప్ చెప్పారు.. ఆ తర్వాత కరీనాకపూర్ ని ప్రేమించి వివాహం చేసుకోగా.. వీరికి తైమూర్, జే అనే ఇద్దరు కుమారులు జన్మించారు.. ప్రస్తుతం కరీనాకపూర్ కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నారు సైఫ్ అలీ ఖాన్.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు