Kareena Kapoor : బాలీవుడ్ హీరోల పరువు తీసేసిన బెబో… ఒళ్ళు కాదు ట్యాలెంట్ చూపించండి

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ హీరోల పరువు తీసేసింది. ఒళ్ళు కాదు టాలెంట్ చూపించండి అంటూ డైరెక్ట్ గా ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. సిక్స్ ప్యాక్ ఉన్నంత మాత్రాన స్టార్ హీరోలు అయిపోలేరని, దానికి టాలెంట్ ఉండాలని బెబో సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఆమె ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేసింది? ఆమె అలా అనడం వెనక ఉన్న కారణం ఏంటి? అంటే…

ఇటీవల కరీనా కపూర్ నటించిన ఫస్ట్ ఓటిటి మూవీ “జానే జాన్” నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. అందులో కరీనాకపూర్ పోషించిన మాయా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనాకు “హిందీ సినిమాల్లో స్టార్ కావాలంటే నటుడిగా మంచి టాలెంట్ ఉండాల్సిన టైం వచ్చిందా?” అనే ప్రశ్న ఎదురయింది. ఆ ప్రశ్నకు కరీనా సమాధానం ఇస్తూ అప్పట్లో తన తాత రాజ్ కపూర్, అంకుల్ రిషి కపూర్, నాన్న రణధీర్ కపూర్ సినిమాలు చేసినప్పటికి, ఇప్పటికీ కాలం చాలా మారిపోయిందని, మంచి నటులు అయితే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగుతారని తెలిపింది. స్టార్ డం కావాలంటే బలమైన నటన నైపుణ్యాలను కలిగి ఉండాల్సిన అవసరం ఇండస్ట్రీలో ఏర్పడడం మంచిది అయిందని, కాలంతో పాటు వచ్చిన మంచి మార్పు ఇదేనని వెల్లడించిన కరీనా ఇప్పుడు కపూర్ కుటుంబంలో కూడా రణబీర్ కపూర్ లాంటి గొప్ప నటుడు ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత సిక్స్ ప్యాక్ పేరుతో బట్టలు వేసుకోకుండా ఒళ్ళు చూపించే హీరోలపై సెటైర్లు వేసింది.

నిజానికి మీలో గొప్ప టాలెంట్ ఉంటే ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరిస్తారు. అప్పుడు స్టార్డం దానంతట అదే వస్తుంది. అంతేగాని అతనికి సిక్స్ ప్యాక్ ఉంది, అతను చాలా హాట్ గా ఉన్నాడు కాబట్టి అతను పెద్ద స్టార్ అనేది ఏం ఉండదు. ఒక్కోసారి సిక్స్ ప్యాక్ తో షర్ట్ లేకుండా కనిపించే నటుల దగ్గరకు వెళ్లి “షర్ట్ వేసుకో చూడలేకపోతున్నా” అని చెప్పాలనిపిస్తుంది అంటూ సంచలన కామెంట్స్ చేసింది. కానీ బాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ అన్నది సర్వసాధారణం. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచి షారుక్, సంజయ్ దత్, హృతిక్ రోషన్, టైగర్ షాప్ వంటి హీరోలంతా సిక్స్ ప్యాక్ తో కనిపించిన వారే. అంతేకాకుండా ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ కూడా సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించాడు. గతంలో ఈమె గ్లామర్ పాత్రలు చేసిన సినిమాల్లో, కరీనాతో కలిసి పని చేసిన హీరోలంతా కూడా సిక్స్ ప్యాక్ చూపించారు.

- Advertisement -

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు