Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి స్వల్ప అస్వస్థత.. ఆందోళనలో ఫ్యాన్స్..!

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈరోజు యువగళం – నవశకం సభలో పాల్గొన్న ఆయన నిన్న రాత్రి నుంచి జ్వరం కారణంగా స్వల్ప అనారోగ్యం గా ఉండడంతో సభకు కొంచెం ఆలస్యంగా చేరుకున్నట్లు సమాచారం. మరోవైపు కొందరు అస్వస్థత కారణంగా పవన్ కళ్యాణ్ సభకు హాజరు కాకపోవచ్చు అనే ఊహాగానాలను కూడా వినిపించారు. అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తరచూ అస్వస్థతకు గురవుతూ ఉండడం అభిమానులను మరింత కలవరపాటు కు గురిచేస్తుంది. ఒకవైపు సినిమా షూటింగ్ లు మరొకవైపు రాజకీయ సభలు సమావేశాలతో బిజీగా ఉండడంతో పవన్ కళ్యాణ్ ఇలా అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.

ఇటీవలే పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురి కావడంతో ఓ సభ , ఓ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడినట్లు సమాచారం. అంతేకాదు గతంలో కూడా ఇలా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నందమూరి తారకరత్నకు నివాళులు అర్పించడానికి కూడా వెళ్లలేదని గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఇలా తరచూ అస్వస్థకు గురవుతూ ఉండడం వల్ల కొన్ని తప్పనిసరిగా వెళ్లవలసిన సభలకు హాజరవుతున్నారు ఈ క్రమంలోని ఇవాళ జరిగిన యువగళం – నవశకం సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే కాస్త ఆలస్యంగానే ఆయన వెళ్లినట్లు సమాచారం.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలు అంటూ మరింత బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే శరీరానికి విశ్రాంతి ఇవ్వకుండా అలుపెరగకుండా పనిచేస్తున్నారు. కాబట్టి తరచూ అస్వస్థతకు గురవుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల క్రితం తన మేనల్లుడు సాయి ధరంతేజ్ తో కలిసి బ్రో సినిమాను విడుదల చేయగా ఈ సినిమా పెద్దగా కమర్షియల్ విజయాన్ని అందించలేదు. ఇప్పుడు మరొకవైపు హరిహర వీరమల్లు, ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ వంటి సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. ఒకవైపు తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడానికి కష్టపడుతూనే మరొకవైపు ప్రజల కోసం కష్టపడుతున్నారు..ఈ క్రమంలోని ఇలా ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సెలబ్రిటీలు ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు.

- Advertisement -

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు