Saif Ali Khan: ఆదిపురుష్ డిజాస్టర్.. ఇంతకాలం తర్వాత నోరు విప్పిన లంకేశ్..!

ముఖ్యంగా సినిమా కథ ఎలా ఉన్నా సరే.. దానిని తెరకెక్కించే విధానం.. ప్రేక్షకులను ఆకర్షించేలా తీర్చగలిగే టాలెంట్ ఉంటే .. కచ్చితంగా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది.. లేకపోతే భారీ బడ్జెట్ తో తెరకెక్కినా సరే డిజాస్టర్ పాలు అవ్వాల్సిందే.. అలా భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఆది పురుష్ సినిమా అతి ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీత గా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా తెరకెక్కిన చిత్రం ఆది పురుష్.. భారీ అంచనాల మధ్య గత ఏడాది జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇందులో నటించిన నటీనటులు ఎవరు కూడా పెద్దగా మీడియా ముందుకు రాలేదు.

కానీ సినిమా విడుదలైన దాదాపు 7 నెలల తర్వాత మొదటిసారి ఈ సినిమా డిజాస్టర్ పై సైఫ్ అలీ ఖాన్ స్పందించారు. ఇక ఈయన ఆదిపురుష్ సినిమాలో లంకేశ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఈయన లుక్కుపై విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. ఇక తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలని నేను బలంగా నమ్ముతాను.. నన్ను నేను స్టార్ అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నా పేరెంట్స్ పెద్ద స్టార్స్ కానీ సింప్లిసిటీకే ఓటు వేసేవారు నేను కూడా ఇప్పుడు వాస్తవంలోనే బ్రతకాలనుకుంటున్నాను..

ఓటమిల గురించి భయపడను.. ఆదిపురుష్ ని ఉదాహరణగా తీసుకుంటే.. కొన్నిసార్లు రిస్క్ కూడా చేయాలి.. ఓటమి తీసుకోగలగాలి.. జీవితం అన్నాక కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి.. అన్నీ ఓర్చుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాము. కష్టం వచ్చినప్పుడు ముడుచుకుపోకూడదు.. మనం మన వంతు ప్రయత్నించాము.. దురదృష్టం కొద్దీ వర్కౌట్ కాలేదు.. నెక్స్ట్ సినిమాకి చూసుకుందాంలే అని ధైర్యంగా ముందుకు సాగిపోవాలి.. ఇప్పుడు అదే నేను చేస్తున్నాను అంటూ సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చారు.. మొత్తానికైతే సినిమా డిజాస్టర్ అయినా సరే కృంగిపోకుండా నెక్స్ట్ అవకాశం కోసం ఎదురుచూస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఆలోచనలకు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా ఒక సినిమా డిజాస్టర్ అయితే మరో సినిమా అవకాశం రాదని స్టార్ హీరోలు కూడా భయపడుతూ ఉంటారు.. అలాంటి సమయంలో మరొకసారి ప్రయత్నం చేస్తే తప్పు లేదని నిరూపిస్తున్నారు సైఫ్ అలీఖాన్. ఇక ఆయన తన తదుపరి చిత్రాలతో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు