OG : రక్తాన్ని మరిగించే డైలాగ్ లీక్… టీజర్ కట్ లో ఉంటుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న మూవీ “ఓజి”. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీనీ సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బ్రో తర్వాత కొంచం గ్యాప్ తీసుకుని పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఇదే కావడంతో ఎక్సైటింగ్ గా ఉన్నారు మెగా ఫ్యాన్స్. “ఓజి” నుంచి చిన్న అప్డేట్ వచ్చినా వైరల్ చేసి పారేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పవర్ ఫుల్ డైలాగ్ లీక్ అయింది. మరి ఈ డైలాగ్ టీజర్ లో కూడా ఉండబోతుందా? అంటే…

1950 బ్యాక్ డ్రాప్ లో ముంబై గ్యాంగ్ స్టర్స్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది “ఓజి”. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, రిలీజ్ డేట్ పోస్టర్ లో పవన్ స్టైల్, స్వాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో “ఓజి” రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పాట కూడా పాడబోతున్నాడు. దీంతో పవన్ గళం విప్పితే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ ను ఈ మూవీతో ప్రూవ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. కాగా “ఓజి” మూవీ షూటింగ్ లాస్ట్ ఇయర్ జనవరి 30న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. చాలా వరకు షూటింగ్ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పనుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. మేలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ సినిమాలపై దృష్టి సారించనున్నారు. అయితే రీ ఎంట్రీలో ముందుగా “ఓజి” మూవీని పూర్తి చేయబోతున్నారు పవన్. ఈ నేపథ్యంలోనే టీజర్ పై ఆసక్తి నెలకొనగా, అందులో ఓ పవర్ ఫుల్ డైలాగ్ ఉందన్న విషయం బయటకు వచ్చింది.

“ఓజి”లో రౌడీలతో ఫైట్ చేసే సన్నివేశంలో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ అభిమానుల రక్తాన్ని మరిగించేలా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ ఫైట్ సీక్వెన్స్ లో పవన్ “నేను రక్తానికి మరిగిన చీతాను. నా పంజా దెబ్బ తట్టుకుని నిలబడే మగాడు ఎవడైనా ఉన్నాడా?” అంటూ అదిరిపోయే డైలాగ్ చెప్తారట. మరి ఈ డైలాగ్ టీజర్ లో ఉంటుందా లేదా అనేది తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఈ డైలాగ్ చెప్తే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అంటున్నారు మెగా ఫ్యాన్స్.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు