Raja Ravindra: రవితేజ కాళ్లు కడిగాను.. కానీ గొడవ తప్పలేదు – నటుడు రాజా రవీంద్ర..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన రాజా రవీంద్ర.. భర్తగా, బావమరిదిగా, తండ్రిగా, విలన్ గా ఇలా పలు క్యారెక్టర్లు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇక సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో హీరోలకు కాల్ షీట్లు, షెడ్యూల్స్ చూడడం మొదలుపెట్టారు. అలా వెంకటేష్, సితార, నిఖిల్, రాజ్ తరుణ్, జయసుధ,నవీన్ చంద్ర తో పాటు మరికొంతమంది కాల్ షీట్స్ చూస్తున్నారు. ఇక ఈయన ఈ ఫీల్డ్ లోకి వచ్చిన కొత్తలో రవితేజ కాల్ షీట్స్ చూసేవాళ్ళు. వాళ్ళిద్దరూ పైగా మంచి ఫ్రెండ్స్ కూడా.. అలాంటిది ఇప్పుడు రవితేజ కాల్ షీట్స్ రాజా రవీంద్ర చూడడం లేదు.. అలానే సునీల్ తో కూడా ఆయనకు గొడవలు ఉన్నాయనే వార్త ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే వీళ్ళ మధ్య గొడవ రావడానికి కారణం ఏంటి అన్న విషయాలపై తాజాగా రాజా రవీంద్ర క్లారిటీ ఇచ్చారు.. మొన్న మధ్య ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజా రవీంద్ర మాట్లాడుతూ.. రవితేజ, నేను , సునీల్ ముగ్గురం ఒక ఊరి వాళ్ళం.. మా మధ్య చాలా చిన్న గొడవలు, కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల కాల్ షీట్స్ చూడడం లేదు.. అంతేకానీ మేము ఇప్పటికీ క్లోజ్ గానే ఉంటాము.. సినిమా ఇండస్ట్రీలో ఒక పది రోజులు ఎవడైనా లేడంటే ఇంకోడు వారి గురించి ఏదో చెప్పాలని చూస్తాడు.. అలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మా మధ్య గొడవలు జరిగాయి.. ఒకానొక సమయంలో నేను, రవితేజ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళము.. ఆయన పెళ్లికి నేను కాళ్లు కూడా కడిగాను.. ఇప్పుడు కూడా అలానే ఉంటాము..వాళ్ళు మా ఇంటికి వస్తారు.. పిల్లలు కూడా మా ఇంటికి వస్తారు.. అంతే తప్ప పెద్దపెద్ద గొడవలు, మాట్లాడుకోకపోవడం ఇలాంటివి ఏమీ లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు రాజా రవీంద్ర..

అలాగే సునీల్ గురించి మాట్లాడుతూ.. సునీల్ హీరోగా మానేసిన తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయాడు. ఇప్పుడు తమిళ సినిమాలు చేస్తున్నాడు. తన కి కూడా చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి.. నేను ఏదైనా షార్ట్ లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది.. అంతేకాదు సునీల్ కి సపరేట్ మేకప్ మేన్ కూడా ఉన్నాడు.. పైగా అందరూ ఆయనకు చెప్పాల్సిందే.. అలాంటప్పుడు నేను ఆయన కాల్ షీట్స్ చూడడం అవసరం లేదు కదా.. అందుకే ఆయన దగ్గర పని చేయడం లేదు అంతే తప్ప మా మధ్య ఏ గొడవలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు రాజా రవీంద్ర..

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు