Kriti Sanon : హీరోతో ఇంటిమేట్ సీన్… మొత్తం లేపేయాల్సిందే అంటున్న సెన్సార్ బోర్డు

కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మహేష్ సరసన “1 నేనొక్కడినే” సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రభాస్ తో “ఆదిపురుష్” సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ఆ తరువాత తెలుగు సినిమాలో కన్పించలేదు ఈ అమ్మడు.. తాజాగా ఆమె హీరోయిన్ గా ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా’ నటించిన రొమాంటిక్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా సెన్సార్ కారణంగా కష్టాల్లో పడింది.

షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఫిల్మ్ ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా’ ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో షాహిద్ రోబో సైంటిస్ట్‌గా, కృతి ఏఐ రోబోగా నటించారు. ఒక సైంటిస్ట్‌ రోబోతో ప్రేమలో పడితే ఏంటి పరిస్థితి అనే ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీకి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. హీరోహీరోయిన్లు ప్రస్తుతం ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైపోయింది. ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్ఝా జియా’ సినిమా విషయంలో చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది సెన్సార్ బోర్డు. వాస్తవానికి ఫిబ్రవరి 2నే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కానీ తాజాగా మరోసారి సెన్సార్ బోర్డు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కట్ చేయాలంటూ ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది. అందులో భాగంగా కొన్ని ఇంటిమేట్ సీన్స్‌పై సెన్సార్ బోర్డు కత్తెర వేసిందనే వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఉన్న ఇంటిమేట్ సీన్స్‌లో 25% కట్ చేసినట్లు తెలుస్తోంది.

వాలంటైన్స్ డే వీక్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్ 36 సెకన్లు కాగా, ఇప్పుడు సెన్సార్ బోర్డు దాన్ని దాదాపు 9 సెకన్లు కట్ చేసి, 27 సెకన్లకు తగ్గించారు. దీంతో పాటు సినిమాలోని కొన్ని డైలాగులను కూడా మార్చారు. సినిమాలో ‘దారు’ అనే పదాన్ని తొలగించి, ఆ స్థానంలో ‘డ్రింక్’ని రీప్లేస్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడైనా స్మోకింగ్ సీన్లు ఉంటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో క్యాపిటల్ లెటర్స్‌తో పాటు హిందీలో మెసేజ్ రాయాలని సెన్సార్ బోర్డ్ మేకర్స్‌కి సూచించినట్లు సమాచారం. ఈ సెన్సార్ కట్స్ అన్ని పూర్తయ్యాక ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా’ మూవీ రన్ టైం 143.15 నిమిషాలు అంటే 2 గంటల 23 నిమిషాలు. ఇక మొదటి సారి షాహిద్, కృతి సిల్వర్ స్క్రీన్ ఫై రొమాన్స్ చేస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు