Venkatesh Maha Movie: సహజత్వానికి కేరాఫ్ వెంకటేష్… మళ్లీ వస్తున్నాడు

కేరాఫ్ కంచరపాలం… ఈ సినిమా సహజత్వానికి కేరాఫ్. అత్యంత సాధారణ మనుషులు.. సాధారణమైన కథతో ఆడియన్స్‌ని కట్టే పడేశాడు వెంకటేష్ మహా. ఈయన దర్శకత్వంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, డెబ్యూగా వచ్చిన కేరాఫ్ కంచరపాలం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకు వెంకటేష్ సొంతంగా కథను అందించాడు. దీని తర్వాత వచ్చిన సినిమాలకు సొంత స్టోరీ కాదు.

అయితే ఇప్పుడు వెంకటేష్ మరోసారి సొంత కథతో రాబోతున్నారట. యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో నటించబోతునట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. సందీప్ కిషన్ ప్రస్తుతం ఊరు పేరు భైరవకోన సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 09న విడుదల కావాల్సింది. కానీ, ఈగల్ మూవీ కోసం, ఫిల్మ్ ఛాంబర్ సూచనతో వాయిదా పడింది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ కానీ, ట్రైలర్ గానీ మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. అంతే కాదు, మంచి హిట్ కూడా అవ్వొచ్చు అనే టాక్ ను ముందుగానే తెచ్చుకుంది ఈ సినిమా.

దీని తర్వాత సందీప్ – వెంకటేష్ మహా సినిమా ఉండబోతుందని సమాచారం. వెంకటేష్ మహా నుంచి వచ్చిన ప్రతి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. కానీ, ఆయన కొన్ని సందర్భాల్లో చేసే డైలాగ్సే ఆయనపై నెగిటివిటీని తీసుకువస్తాయి. ఇటీవల కేజీఎఫ్ సినిమా గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి, హీరో యష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల వెంకటేష్ ఓ సినిమా రిలీజ్ టైంలో షాకింగ్ ట్వీట్ వేశాడు. అది కూడా వైరల్ అవ్వడం, ఆయనపై నెగిటివిటీని తీసుకువచ్చాయి. దీంతో ట్విట్టర్ అకౌంట్ నే డిలీడ్ చేశాడు.

- Advertisement -

ఇలా వెంకటేష్ మహాపై ఇంత వ్యతిరేకత ఉన్నా… ఆయన డైరెక్షన్ లో వచ్చే సినిమాలపై ప్రేక్షకుల నుంచి ఆసక్తి అయితే ఉంటుంది. సందీప్ కిషన్ తో వస్తుంది అంటూ రూమర్స్ వస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు కూడా అవే అంచనాలు ఉంటున్నాయి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు