Family star: ఫ్యామిలీ స్టార్ లో రష్మిక.. దానికోసమేనా..?

టాలీవుడ్ యంగ్ హీరోలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.. ప్రస్తుతం డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో చేస్తున్న రెండవ చిత్రం ఫ్యామిలీ స్టార్.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అయింది. రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తూనే మేకర్స్ ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇటీవలే రెండో సాంగ్ “కళ్యాణి వచ్చే వచ్చే” పాటను కూడా విడుదల చేశారు.. ఇందులో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ విజువల్స్ అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి..

కళ్యాణి వచ్చే వచ్చే పాట..
దీన్ని బట్టి చూస్తే తప్పకుండా ఫ్యామిలీ స్టార్ సినిమాలో ఈ సాంగ్ చాలా హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇదివరకే ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ని కూడా విడుదల చేయగా ఇందులో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఉండబోతున్నట్లు కనిపించింది.. కళ్యాణి వచ్చే వచ్చే సాంగ్ వైరల్ అవుతున్న సమయంలో ఎన్నో రకాల మీమ్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. హీరో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ఉన్నప్పుడు అంత రిచ్ పాట అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొంతమంది హీరోయిన్ భవిష్య రిచ్ అయ్యుండొచ్చు అంటూ కామెంట్స్ చేయగా మరికొంతమంది అది డ్రీం సాంగ్ అయి ఉండవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

ఫ్యామిలీ స్టార్ లో రష్మిక..
అయితే ఇందులో రష్మిక కనిపించడం తో ఒక వర్గం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. రష్మిక ఈ సినిమాలో కనిపించబోతోందని.. ముఖ్యంగా కళ్యాణి వచ్చే వచ్చే సాంగ్ లో ఆమె స్పెషల్ సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు కథనాలు అయితే విలువడుతున్నాయి.. అంతేకాకుండా ఫ్యామిలీ స్టార్ షూటింగ్లో రష్మిక , విజయ్ దేవరకొండ , మృణాల్ ఠాకూర్ కలిసి ఉన్నట్టుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. దీన్నిబట్టే కచ్చితంగా ఈ చిత్రంలో రష్మిక పాత్ర కీలకంగా ఉండబోతుందని చెప్పవచ్చు.

- Advertisement -

రష్మిక క్రేజ్..
మరి రష్మిక పాటలలో మాత్రమే కనిపిస్తుందా లేక మిగతా సినిమాలలో లాగా ఏదైనా స్పెషల్ పాత్రలో కనిపిస్తుందా అనే విషయం తెలియాలి అంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా కి ఏదో విధంగా ఈ విషయం క్రేజ్ ను తెచ్చిపెడుతోంది. వాస్తవానికి నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక కి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది. పైగా విజయ్ దేవరకొండ తో ఎఫైర్ అనే రూమర్ కూడా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఈ రెండింటిని వాడుకుంటూ.. సినిమాపై బజ్ తీసుకురావడానికి ఆమెను ఈ పాటలో జత చేశారు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రష్మిక క్రేజ్ ని ఫ్యామిలీ స్టార్ మూవీ కి ఉపయోగించుకుంటున్నారని వార్తలు అయితే స్పష్టం అవుతున్నాయి.

ఫ్యామిలీ స్టార్ విశేషాలు..
ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తూ ఉన్నారు .. మొదట మార్చిలోనే విడుదల చేయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత వాయిదా వేశారు.. ఏప్రిల్ 5న దేవరా సినిమా వాయిదా పడడంతో ఆ తేదీకే ఫ్యామిలీ స్టార్ సినిమాని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు