Reba Monica: చిన్న సినిమాతో ఎంట్రీ ఇస్తుంది.. నిలబడగలదా?

టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా స్టార్ హీరోలు నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలే కాస్తో కూస్తో జనాదరణ పొందుతున్నాయి. ఒక విరూపాక్ష, ఒక బలగం అలా చిన్న సినిమాలే పెద్ద హిట్ అవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ డిజాస్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లందరూ చిన్న సినిమాలవైపునకు మొగ్గు చూపారు.

ఇప్పడు చిన్న సినిమాల్లో క్రేజీ బజ్ ని సొంతం చేసుకున్న సినిమా “సామజవరాగమన”. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా కామెడీ ప్రధానంగా తెరకెక్కింది. ఇక ఈ సినిమా టీజర్, పాటలు కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడంతో టాలీవుడ్ లో మంచి అంచనాల మధ్య జూన్29 న విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా విజయం అందరికంటే ఎక్కువగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రెబ్బ మోనికా కి కీలకంగా మారింది.

బెంగుళూరు కి చెందిన ఈ భామ సామజవరాగమన తో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ హీరోయిన్ అంతకు ముందే తమిళ, మలయాళ భాషల్లో నటించినా అన్ని సైడ్ రోల్స్, సెకండ్ లీడ్ రోల్స్ వచ్చాయి. ఈ సినిమాతో మెయిన్ హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ఈ భామ. టీజర్ చూస్తుంటే ఈ భామకి గట్టి రోలే పడినట్టుంది. అయితే ఫస్ట్ సినిమాయే చిన్న సినిమా కావడంతో మనసులో ఈ సినిమా హిట్ అవుతుందో లేదోనని ఒక డౌట్ ఉండుంటుంది.

- Advertisement -

అందుకే ప్రమోషన్లలో మాట్లాడ్డానికి తడబడుతుంది. కానీ కంటెంట్ బాగుంటే మంచి హిట్ అయ్యి రెబ్బ మోనికా కు వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మరి జూన్29 న విడుదలవుతున్న “సామజవరాగమన” టాలీవుడ్ లో చిన్న సినిమాల మాదిరి పెద్ద హిట్ అవుతుందా? ఈ సినిమా ద్వారా హీరోయిన్ కెరీర్ కి ఎంత హెల్ప్ అవుతూనే చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు