Asvins: ఈ హీరోయిన్ ఎవరికైనా గుర్తుందా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల లైఫ్ రెండిటికి భిన్న కోణాలుంటాయి. హీరో కెరీర్ మొదట నెమ్మదిగా సాగుతుంది. అవకాశాల కోసం కొట్టుమిట్టాడతాడు. ఒక్క కమర్షియల్ సక్సెస్ రాగానే మంచి గుర్తింపు పొంది ఆ వెంటనే పది సినిమాల అవకాశాలు పొందుతాడు. కానీ హీరోయిన్ల పరిస్థితి దీనికి పూర్తి రివర్స్ గా ఉంటుంది. ఇతర ఇండస్ట్రీలో గురించి తెలియదు గాని, టాలీవుడ్ లో మాత్రం ఏ హీరోయిన్ అయినా గ్లామర్ రోల్స్ చేస్తేనే ఎక్కువ కాలం నిలదొక్కుకుంటుంది. ఆ హీరోయిన్ కి హిట్ వచ్చినా ప్లాప్ వచ్చినా మినిమం అవకాశాలు వస్తాయి. ఒకవేళ హిట్లొచ్చి స్టార్ హీరోయిన్ అయినా, ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే 15ఏళ్ళకి మించి హీరోయిన్ గా కొనసాగలేరు. కానీ హీరో 30ఏళ్ళ వరకైనా కొనసాగొచ్చు.

టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో అలాంటి హీరోయినే విమలా రామన్. ఆస్ట్రేలియా కి పుట్టిన ఈ భామ పూర్వికులు తమిళనాడు చెందిన వారే. సినిమాల మీద ఇష్టంతో ఇండియాకి వచ్చేసిన విమల రామన్ ముందుగా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కొన్నాళ్ళు మలయాళం లో స్టార్ హీరోయిన్ గా నిలబడ్డా ఆ తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో తెలుగులోకి వచ్చేసింది. వరుణ్ సందేశ్ తో “ఎవరైనా ఎప్పుడైనా” చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే ప్లాప్ అందుకోవడంతో అవకాశాలు పెద్దగా రాలేదు. బిగినింగ్ లోనే సీనియర్ హీరోల పక్కన చేయడంతో యంగ్ హీరోలతోనూ ఛాన్స్ రాలేదు.

ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసి మళ్ళీ కేరళకి వెళ్ళిపోయింది. చివరగా పదేళ్లకిందట తరుణ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ భామ మళ్ళీ ఆరేళ్లకిందట వచ్చిన ఓం నమోవెంకటేశాయ లో చిన్న పాత్రలో నటించింది. మళ్ళీ ఇన్నాళ్ళకి తెలుగులో “అశ్విన్స్” అనే ద్విభాషా చిత్రంతో వచ్చింది. తన అన్ లక్ కొద్దీ ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా పట్టు విడువకుండా తెలుగులో అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉంది. విమలారామన్ ప్రస్తుతం జగపతి బాబుతో రుద్రంగి అనే సినిమాలో నటిస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు