Kollywood: డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే..!

వారం రోజుల క్రితం డ్రగ్స్ సరఫరా చేస్తూ కబాలి సినిమా నిర్మాత కె.పి చౌదరి పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. దీంతో ఆయనని కస్టడీలోకి తీసుకొని విచారించారు పోలీసులు. చౌదరి సెల్ ఫోన్ డేటా, చాటింగ్ ల ఆధారంగా కీలక సమాచారాన్ని రాబట్టారు. కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి తో పాటు నటి జ్యోతి, సురేఖ వాణి ఇతర ప్రముఖ నటీమణులతో కేపీ చౌదరి సన్నిహితంగా ఉన్న ఫోటోలు.. అలాగే కే.పి చౌదరి – అషు రెడ్డిల మధ్య వందల ఫోన్ కాల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో ఇప్పుడు అషురెడ్డి పేరు వైరల్ అవుతుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఇదే విషయంపై అశురెడ్డి స్పందించింది. అనవసరంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది అషు రెడ్డి. డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్నట్లు తనకు ఎవరితోనూ డ్రగ్ సంబంధాలు లేవని, అవన్నీ తప్పుడు వార్తలేనని చెప్పుకొచ్చింది. ఈ కేసులో అవసరమైతే విచారణ ఎదుర్కొంటానని.. సంబంధిత అధికారులకు వాస్తవం ఏంటనేది తెలియజేస్తానని తెలిపింది.

కానీ తన ఫోన్ నెంబర్ ని మాత్రం అనుమతి లేకుండా బహిరంగంగా ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించింది. అయితే ఈ కేసులో ఆధారాలు దొరికితే ఆమెను ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ, ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు