Uppena: కూతురిగా చేసిన అమ్మాయితో రొమాన్స్ కి నో చెప్పిన విజయ్ సేతుపతి..

కొంతమంది యాక్టర్స్ నటిస్తుంటే ఏకంగా జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో అలాంటి నటులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఇప్పటి తరంలో కోలీవుడ్ స్టార్ హీరో, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతిని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఆయన ఏ పాత్ర చేసినా దాన్ని పండించడంలో సిద్ధహస్తుడు. తమిళ్ లోనే కాదు అన్ని భాషలలో దర్శకులు ఈ నటుడి డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు.

సైరా నరసింహారెడ్డి సినిమాతో తెలుగు పరీక్షకులకు పరిచయమయ్యాడు విజయ్ సేతుపతి. ఆ తరువాత ఉప్పెన సినిమాలో రాయనం పాత్రతో హీరోయిన్ తండ్రిగా, నెగిటివ్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఓ సినిమాలో తనకి జంటగా 17 ఏళ్ల కృతి శెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేసారట. కానీ ఉప్పెన సినిమాలో బేబమ్మకు తండ్రిగా నటించి, ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేయడం అంటే చాలా కష్టమని ఆమెని రిజెక్ట్ చేశాడట విజయ్. కానీ అలాంటి ఇబ్బందులు ఏమీ లేని కృతి శెట్టి.. విజయ్ సేతుపతితో నటించడానికి సిద్ధంగా ఉండడం విశేషం.

- Advertisement -

అయితే తనకి కృతి వయసు ఉన్న కొడుకు ఉన్నాడని.. అందుకే ఆమెతో కలిసి నటించలేనని దర్శకనిర్మాతలకు తేల్చి చెప్పాడట విజయ్. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. దీంతో విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు