Teja sajja: హనుమాన్‌కు అడ్డేంటి ? ప్రశాంత్ వర్మ భయపడుతున్నాడా?

సినిమాటిక్ యూనివర్స్ లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో డైరెక్టర్లు అందరూ అదే ఫాలో అవుతున్నారు. అందులో భాగంగా కల్కి, జాంబి రెడ్డి వంటి సినిమాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ సూపర్ హీరోస్ అనే కాన్సెప్ట్ తో సినిమాటిక్ యూనివర్స్ చేస్తున్నాడు. దీనిలో నుంచి హనుమాన్, అధీర వంటి సినిమాలు వస్తున్నాయి. అందులో హనుమాన్ సినిమాన్ లో యంగ్ హీరో తేజా సజ్జా లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి చాలా రోజులే అవుతుంది. అయినా ఇంకా విడుదలకు నోచుకోలేదు.

నిజానికి హనుమాన్ ను సమ్మర్ కానుకగా ఏప్రిల్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఏప్రిల్ లో విడుదల చేయడం జరగలేదు. దీనిపై స్వయంగా చిత్ర యూనిటే క్లారిటీ ఇచ్చింది. బెటర్ అవుట్ పుట్ ఇవ్వడానికి వాయిదా వేయక తప్పడం లేదు అంటూ ఓ నోట్ ను విడుదల చేసింది. ఏప్రిల్ పోయింది… జూన్ అయిపోతుంది.. జూలై వస్తుంది. అయినా, హనుమాన్ రిలీజ్ పై ఒక్కటి అంటే ఒక్క ప్రకటన కూడా రావడం లేదు. కనీసం ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కూడా కరువయ్యాయి.

ఈ చిత్రం టీజర్ అద్భుతంగా ఉండటం, ఆదిపురుష్ కంటే మెరుగైన వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండటంతో అనుకున్న దాని కంటే మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ, దర్శక నిర్మాతలు మాత్రం ఆదిపురుష్ రిలీజ్ అయిన తర్వాత, దానికి వచ్చిన టాక్ చూసిన తర్వాత హనుమాన్ ను రిలీజ్ చేయాలని అనుకున్నారు. తీరా చూస్తే ఆదిపురుష్ మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ వస్తుందా రాదా అనేది కూడా డౌటే. ఇలాంటి సందర్భంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది.

- Advertisement -

ఆదిపురుష్ వల్ల ప్రేక్షకులకు ఏం కావాలో తెలిసిపోయింది. ఏది చేయకూడదో కూడా తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో హనుమాన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. అందుకే హనుమాన్ విడుదల వాయిదా పడుతుందని టాక్ వినిపిస్తుంది. కాగా, ఆదిపురుష్ కి వచ్చిన నెగిటివ్ టాక్ ను చూసి, హనుమాన్ టీం స్పందించిన విషయం తెలిసిందే. తమ సినిమాలో తప్పుగా ఏం చూపడం లేదు అంటూ చిత్ర యూనిట్ ఓ నోట్ విడుదల చేశారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు