Saamajavaragamana: ఈ సినిమాతో టాప్ లో ఫిక్స్ అవుతాడా?

వెన్నెల కిషోర్.. టాలీవుడ్ లో ఇతని గురించి తెలియని వారుండరు. వెన్నెల సినిమాతో పరిచయమైన ఈ నటుడు బిందాస్, ఆరంజ్, దూకుడు, లవ్లీ,ఛలో సినిమాలతో కామెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. బ్రహ్మానందం తర్వాత ఆ రేంజ్ కామెడీ చేయగలిగిన నటుడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు క్షణం, గూఢచారి లాంటి సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో మెప్పించాడు. ఇక గీతా గోవిందం, ఒకే ఒక జీవితం, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాల్లో తన కామెడీ తో కడుపుబ్బా నవ్వించడమే కాకుండా తనలోని డిఫరెంట్ యాంగిల్ ని చూపిస్తూ కేవలం ఎక్స్ప్రెషన్స్ తోనే కామెడీ పుట్టించే అతి కొద్ది మంది యాక్టర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు వెన్నెల కిషోర్.

అయితే కామెడియన్లలో కూడా పోటీ ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఒకప్పుడు రేలంగి, అల్లు రామలింగయ్య, నెంబర్ వన్ గా కామెడీ లోకాన్ని ఎలాగా వీరి స్థానాన్ని బ్రహ్మానందం భర్తీ చేస్తూ దాదాపు పాతికేళ్ళు నెంబర్ వన్ గా నిలబడ్డారు. మధ్యలో ఎమ్మెస్ నారాయణ, అలీ లాంటి యాక్టర్ లు పోటీ ఇచ్చినా అది కొద్దీ కాలం మాత్రమే. అయితే ఇప్పుడు బ్రహ్మానందం వయసు రీత్యా పాత్రాలు తగ్గిస్తూ వస్తున్నారు. అందువల్ల ఆయన రేంజ్ లో కామెడీ పండించే వారి వైపు మొగ్గుచూపుతున్నారు దర్శకులు.

అలాంటి కామెడియన్లలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న నటుడు వెన్నెల కిషోర్. మధ్యలో ప్రియాదర్శి, రాహుల్ రామకృష్ణ, సప్తగిరి లాంటి కమెడియన్లు ట్రెండైనా వాళ్ళు కొన్ని సినిమాల్తో ఆ పాత్రల ద్వారే మెప్పించారు. కానీ వెన్నెల కిషోర్ కోసం మాత్రం పాత్రలే కొత్తగా తయారు చేస్తారు. గత యేడాది ఒకే ఒక జీవితం లో బ్రోకర్ శీను గా ఓ రేంజ్ ఫన్ క్రియేట్ చేసిన కిషోర్ ఈ సంవత్సరం “కుల భూషణ్” గా వస్తున్నాడు. శ్రీవిష్ణు నటించిన సామజవరాగమన మూవీలో తన కామెడీయే ప్రధానంగా సాగనుందని చిత్ర యూనిట్ తెలిపారు. జూన్29న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో వెన్నెల కిషోర్ నెంబర్ వన్ హాస్య నటుడి స్థానాన్ని సొంతం చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు