Kalki 2898 AD : రికార్డు ధరకు ఓవర్సీస్ రైట్స్… డిస్ట్రిబ్యూటర్లు దొరక్కపోతే ఇదే ప్లాన్

Kalki 2898 AD

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కాస్ట్లీ సైన్స్ ఫిక్షన్ మూవీ “కల్కి 2898 AD”. గ్లోబల్ రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై హాలీవుడ్ లో కూడా హై రేంజ్ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారతీయ పురాణాల స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్ మూవీగా “కల్కి”ని రూపొందిస్తున్నారు. ప్రభాస్ తో పాటు దీపిక పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి భారీ తారాగణం, భారీ బడ్జెట్, అబ్బురపరిచే గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ హైప్ తో రిలీజ్ కు రెడీ అవుతున్న “కల్కి” థియేట్రికల్ బిజినెస్ విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

“కల్కి” మూవీ రైట్స్ కోసం మేకర్స్ అన్ని ప్రాంతాల్లో ట్రిపుల్ ఆర్ కంటే పెద్ద మొత్తంలో కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో “కల్కి” మూవీ డీల్ కోసం మేకర్స్ పెట్టిన రేటు చర్చకు దారి తీసింది. “కల్కి” ఓవర్సీస్ రైట్స్ కు మేకర్స్ ఏకంగా 100 కోట్లు కోట్ చేస్తున్నారని సమాచారం. అయితే మేకర్స్ ఈ రేంజ్ లో రైట్స్ ను అమ్మకానికి పెట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు 70 నుంచి 75 కోట్ల ఆఫర్ తో ఓవర్సీస్ రైట్స్ ను కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారట. కానీ నిర్మాతలు మాత్రం 100 కోట్ల కంటే తక్కువకు “కల్కి” రైట్స్ ను అమ్మడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. మరి ఒకవేళ 100 కోట్లకు ఈ మూవీ రైట్స్ ను తీసుకోవడానికి ఎవ్వరూ రెడీగా లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే దానికి కూడా ముందస్తు ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారట “కల్కి” మేకర్స్. తాము ఎక్ష్పెక్ట్ చేస్తున్న ధరకు కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోతే మేకర్స్ సొంతంగా “కల్కి” మూవీని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది.

“కల్కి” మూవీని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ నిర్మాతలు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించడం ఖాయమని నమ్ముతున్నారు. అందుకే కేవలం ఓవర్సీస్ లోనే కాదు అన్ని ప్రాంతాల్లోనూ భారీ ధరకు “కల్కి” రైట్స్ ను అమ్మకానికి పెడుతున్నారట. ఏరియా ఏదైనా సరే తాము అనుకున్న ధరకు “కల్కి” రైట్స్ తీసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపించకపోతే సొంతంగా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారట. మరి “కల్కి” మూవీ రైట్స్ విషయంలో డిస్ట్రిబ్యూటర్లు ముందడుగు వేస్తారా, లేదంటే వైజయంతి మూవీస్ వాళ్లకే వదిలేస్తారా అనేది చూడాలి. కాగా “కల్కి” మూవీని మే 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా, అది పూర్తి కాగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు