Dada Saheb Phalke : భారతీయ చలన చిత్ర పితామహుడు.. కానీ జీవిత చరమాంకం ఎలా గడిచిందో తెలుసా?

దాదాసాహెబ్ ఫాల్కే. సినీ ప్రేమికులు ఎవర్ని అడిగినా ఈయన భారత చలన చిత్ర పితామహుడు అని అంటారు. ఆ కాలం నాటి వ్యక్తి అయినా, ఈయన పేరు మీద ఇచ్చే అవార్డుల సమయంలో దాదా సాహెబ్ గురించి జనాలు బాగా తెలుసుకున్నారు. అసలు పేరు దుండి రాజ్ గోవింద్ పాల్కే అయినా, జనాలకు మాత్రం దాదా సాహెబ్ పాల్కే గానే ఎక్కువ పరిచయం . అలాంటి ఈయన రాజా హరిశ్చంద్ర(1913) చిత్రం తీసి భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఇంతవరకూ రావడానికి మూల కారణం అయ్యాడు.

ఇంతటి ఘనకీర్తి ఉన్న దాదా సాహెబ్ పాల్కే జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదిగి కోటీశ్వరుడిలా సకల భోగాలతో జీవితం గడిపి ఉంటాడని అనుకుంటారు. కానీ ఆయన జీవితం తుదిదశలో కనీసం ఎంతటి దుర్భరమైన జీవితాన్ని గడిపాడో ఊహించివుండరు. ఒక మరాఠా సంస్కృత పండితుని కుమారుడైన దాదా సాహెబ్ పాల్కే 1870లో నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లో జన్మించారు. బొంబాయిలోని అప్పటి జెజె కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో, బరోడాలోని కళాభవన్ విద్యార్థి అయిన పాల్కే ఒక మంచి చిత్రకారుడు, ఇంకా నాటకాల్లో మేకప్ కూడా వేశారు. అన్నిటికి మించి ఒక ఇంద్రజాలికుడు కూడా. ఈ ఆకర్షణలే సినిమా అనే కళపై పాల్కే ని ఆకర్షితుడిని చేసింది.

- Advertisement -

ఏది ఏమైనా 1912 లో ఇంగ్లాండ్ వెళ్లిన పాల్కే అక్కడ అన్ని రకాల కోర్సులు పూర్తి చేసి భారత్ కి తిరిగివచ్చి 1913 లో రాజా హారిశ్చంద్ర సినిమా తీసాడు. ఆ సినిమా ఎంత పేరు తెచ్చిందో ఆర్ధికంగా అంత దిగిపోయేలా చేసింది. చాలా విజయవంత మైన చిత్రాలు తీసినా, ఒకదాంట్లో వచ్చిన లాభం మరో సినిమాతో పోయింది.

ఇక కెరీర్ చివరిదశలో భారతీయ సినిమా రజతోత్సవ వేడుకల్లో దాదాసాహెబ్ ఫాల్కే ఒక అనామకుడిగా కూర్చోవడం చూసిన శాంతారాం ఆయన్ని గుర్తించి వేదికపైకి తీసుకు పోయి 1938లో అప్పటికప్పుడు వేదికపై ఐదువేల రూపాయల చెక్కు అందజేశారు. ఆ డబ్బుతో ఫాల్కే సినిమాపై ఉన్న పిచ్చి ప్రేమతో తిరిగి సినిమా తీస్తాడేమోనని చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే సినిమా అంటే ఆ మహనీయునికి అంత పిచ్చి. అందరూ ఒత్తిడి తెచ్చి ఆ డబ్బుతో నాసిక్‌లో ఒక చిన్న ఇంటిని కొనిపించారు. ఎందుకంటే అప్పటి వరకు ఫాల్కేకు సొంత ఇల్లు కూడా లేదు. ఇక బొంబాయిలో జూబ్లీ ఉత్సవాల సందర్భంగా బహుమతి పొందిన తర్వాత ఫాల్కే పేదరికంతోనే స్వగ్రామం చేరుకున్నాడు. దాదాపు అందరూ మర్చి పోయిన తరుణంలో తన ఆత్మీయులు కొనిచ్చిన ఆ ఇంటిలోనే 1944, ఫిబ్రవరి 16 న తుది శ్వాస విడిచాడు.

దాదాపు 90 సినిమాలను నిర్మించిన భారతీయ చలన చిత్ర పితామహుడు కటిక దరిద్రంతోనే కన్నుమూసినా, ఈ నాటికీ అతని జీవన శైలి ఆదర్శంగా, స్ఫూర్తినిచ్చేవిగానే ఉన్నాయి. అయితే దాదా సాహెబ్ పాల్కె పేరు మీద జాతీయ అవార్డుల సంబరం ప్రతి యేటా జరుగుతున్నా, ఆయన జీవిత చరమాంకం ఎంతటి దీనావస్థలో గడిచిందో ఎవరూ తలచకపోవటం చాలా బాధాకరం అని చెప్పాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు