Dadasaheb Phalke: సృజనాత్మక కళాకారుడు.. దాదాసాహెబ్ ఫాల్కే రికార్డ్స్ ఇవే..!

దాదాసాహెబ్ ఫాల్కే.. సినిమా ప్రపంచం బతికున్నంత కాలం ఈయన పేరు చిరస్మరణీయం అని చెప్పడంలో సందేహం లేదు.. సినిమా పరిశ్రమలో నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే , రచయితగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన భారతీయ సినిమా పితామహుడు గా కూడా ప్రసిద్ధి చెందారు. 1913లో తొలి భారతీయ చిత్రం తెరపైకి వచ్చింది అదే రాజా హరిశ్చంద్ర.. ఇక దాదాసాహెబ్ ఫాల్కే మొదటి సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. దాదాసాహెబ్ ఫాల్కే జ్యోతిర్లింగ త్రయంబకేశ్వర్ కి ప్రసిద్ధి చెందిన నాసిక్ లో 1870 ఏప్రిల్ 30 వ తేదీన జన్మించారు ఈయన తండ్రి సంస్కృత పండితులు ముంబైలోని ఎల్ఫిన్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేశారు. దీంతో దాదాసాహెబ్ ఫాల్కే విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే సాగింది. ఇక సినిమా పరిశ్రమ విషయానికి వస్తే.. తొలి రోజుల్లో సినిమా పెద్దగా ఉండేది కాదు.. కెరియర్ కూడా అంతంత మాత్రమే.. ఇకపోతే సినిమా పరిశ్రమను గొప్పగా స్థాపించాలనుకున్న ఆయన జే . జే.స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో శిక్షణ పొంది ఒక సృజనాత్మక కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఒకరోజు విదేశీ చిత్రమైన లైఫ్ ఆఫ్ క్రైస్ట్ సినిమాని ముంబైలోని యూఎస్ ఇండియా థియేటర్లో ప్రదర్శించారు.. ఈ సినిమా చూసిన దాదాసాహెబ్.. సినిమా చూస్తున్నంత సేపు జీసస్ క్రైస్ట్ తో పాటు కృష్ణ, రామ్, సమతా గురు రాందాస్, శివాజీ , సంత్ తుకారం వంటి గొప్ప వ్యక్తులను సినిమాలో చూపించడం ఆయనను ఆకట్టుకుంది.. ఇక ఈ క్రమంలోని ఎలాగైనా సినిమా తీయాలనుకున్న దాదాసాహెబ్ తన మొదటి నాన్ డైలాగ్ సినిమా రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని నిర్మించారు… ఇందులో తన కొడుకు పేరు భల్చంద్ర ఫాల్కే అనే పాత్ర కూడా రూపొందించడం జరిగింది.. ఇందులో దాదాసాహెబ్ హీరోగా, రోహితాశ్వ తన ఏడేళ్ల కొడుకు భల్చంద్రపాల్కేగా నటించారు. ఈ చిత్రం 1913 డిసెంబర్లో కరోనేషన్ థియేటర్లో మొదటిసారి ప్రదర్శించబడింది.

ఈ సినిమా తర్వాత దాదాసాహెబ్ కూడా ఇతిహాసంలో నటించిన చిత్రం భస్మాసూర్. ఇందులో మోహిని, సావిత్రి నటించగా.. ఈ సినిమాతో సమాజంలోని పాత్రల నుంచి ప్రజలకు ఒక ఉదాహరణ ఇస్తూ స్ఫూర్తిదాయకమైన పాత్రలను ఈ సినిమా ద్వారా తెరమీదకు తీసుకొచ్చారు.. దీంతో ప్రతిష్టాత్మక సినిమా అవార్డుకి కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది. సినీ ప్రపంచంలో అతిపెద్ద గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ రంగంలో విభిన్న ప్రాధాన్యత ఉన్న ఈ ప్రతిష్టాత్మక అవార్డు.. సినిమా రంగానికి తమ వంతు కృషి చేసినందుకుగానూ కళాకారుడికి ఇస్తారు. ప్రభుత్వం కూడా ఆయన పేరు మీద ఒక స్టాంప్ ను జారీ చేసింది. దాదాసాహెబ్ ఫాల్కే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విభాగంలో పనిచేశారు..

- Advertisement -

ఇక ఈ యంత్రాన్ని జర్మనీకి తీసుకొచ్చి ఒక మాస పత్రికను ప్రచురించడమే కాకుండా ఆ తర్వాత చిత్ర నిర్మాణ రంగంలో కూడా నిమగ్నమయ్యారు. నాసిక్ లో జన్మించిన దాదాసాహెబ్ చివరికి 1944 ఫిబ్రవరి 16న నాసిక్ లోనే తుది శ్వాస విడిచారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు