Guntur Karam : చాలా కాలం తర్వాత

కాలం మారుతున్న కొద్దీ పరిస్థితులు మారుతాయి అంటారు. అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు సంభవించాయి. ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంది అని తెలియాలంటే ముందు పేపర్లో న్యూస్ వచ్చేది. ఆ తర్వాత ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్లన్నీ అప్పుడప్పుడు పేపర్లో కనిపిస్తూ ఉండేవి. ఇక సినిమా రిలీజ్ కి రెడీ అవుతుందనే టైంలో గోడ మీద పోస్టర్లు కనిపించేవి. ఇదంతా ఒకప్పుడు.

తర్వాత తర్వాత ఆ సినిమాకు సంబంధించిన క్యాసెట్లు వచ్చేవి. ఆ తర్వాత కాలంలో అది కాస్త డివిడిలు, వీసీడీలు రూపంలో వచ్చాయి. ఇప్పుడు ఇంటర్నెట్లో సాంగ్స్ అనేవి ముందు రిలీజ్ అవుతున్నాయి. ఒకప్పుడు ఒకేసారి ఆరు పాటలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఒక పాట తర్వాత మరొక పాట రిలీజ్ అవుతూ వస్తుంది.

సినిమా రిలీజ్ కి టైం ఉంది అనగానే ఆడియో రిలీజ్ ని జరిపేవారు. అదే సమయంలో ఆ సినిమాకు సంబంధించిన పాటలన్నీ బయటికి వచ్చేవి. కానీ ఈ మధ్యకాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడం మొదలుపెట్టారు. అంటే సాంగ్స్ ముందుగానే మార్కెట్లోకి వదిలేసి ఒక రెండు మూడు రోజుల్లో సినిమా రిలీజ్ సిద్ధంగా ఉంది అనుకునే టైంలో అతి పెద్ద ఫంక్షన్ చేసి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయటం. ధ్రువ సినిమా నుంచి ఇది మొదలైంది.

- Advertisement -

ఇకపోతే ఈ రోజుల్లో ఒక సినిమా థియేటర్లో పది రోజులు ఆడడమే కష్టం. ఒక సినిమా ఒక మోస్తరుగా ఆడితే అదే సినిమా ఓటీటీ లో 2,3 వారాల్లో దర్శనమిస్తుంది. కానీ ఈ రోజుల్లో ఒక సినిమా 50 100 రోజులు ఆడటం అంటే కష్టమని చెప్పాలి. లాస్ట్ టైం రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఆర్ సినిమా కొన్ని సెంటర్స్ లో 50 రోజుల వరకు ఆడింది. ఈరోజుల్లో 50 రోజులు పోస్టర్ చూడటం అనేది గగనం అయిపోయింది.

ఈ తరుణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా 50 రోజులు పూర్తిచేసుకుంది. నాలుగు సెంటర్లలో ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. మొదటి షో తోనే మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోతుంది అనుకున్నారు చాలామంది. కానీ మహేష్ బాబు కున్న ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ వలన ఈ సినిమా ఎట్టకేలకు సేఫ్ జోన్ కి వచ్చేసింది. ఏదేమైనా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయిందని చెప్పొచ్చు.

ఏదేమైనా వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాకి 50 రోజులు పోస్టర్ చూడటం అనేది కొంచెం ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సినిమా 50 రోజుల దాటింది అంటే మామూలు విషయం కాదు. ఇక సినిమాకి మంచి టాక్ వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ సెంటర్లో ఈ సినిమా 50 రోజులు పైగా ప్రదర్శనలు జరుపుకునేది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు