Pooja Hegde : బాలీవుడ్ లో బిజీ అవుతున్న బుట్ట బొమ్మ

ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బుట్ట బొమ్మ ఇటీవల కాలంలో తెర మరగయిపోయింది. ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకున్నప్పటికీ, వరుస డిజాస్టర్ లను మూట గట్టుకోవడంతో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. దీంతో పూజా హెగ్డే ను హీరోయిన్ గా తీసుకోవడానికి సౌత్ మేకర్స్ వెనకడుగు వేశారు. ఫలితంగా బుట్ట బొమ్మకు అవకాశాలు కరువయ్యాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి సైలెంట్ గా ముగ్గురు స్టార్ హీరోలను లైన్లో పెట్టేసింది ఈ అమ్మడు. సౌత్ ను వదిలేసి బాలీవుడ్ లి బిజీ అయ్యే పనిలో పడింది బుట్ట బొమ్మ.

మూడు క్రేజీ ప్రాజెక్ట్స్…
ఇక పూజ హెగ్డే కెరీర్ క్లోజ్ అయినట్టే అని టాక్ నడుస్తున్న తరుణంలో ఏకంగా మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టేసి మరోసారి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. ఇక ఆమె లైనప్ విషయానికి వస్తే.. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందుతున్న దేవా అనే మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో ఈ మూవీలో పూజ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. “దేవా” మూవీని దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్ సరసన మరో ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించే మంచి ఛాన్స్ పట్టేసింది పూజా హెగ్డే. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ మొట్టమొదటిసారి పూజా హెగ్డే, కార్తీక్ ఆర్యన్ జంట సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ చేయబోతోంది. పూజా హెగ్డే చేతిలో ఉన్న మూడవ సినిమా విషయానికి వస్తే… సాజిద్ నదియావాలా దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ “సంకి”. ఈ మూవీలో అహన్ శెట్టి సరసన పూజా హెగ్డే నటించబోతోంది. మొత్తానికి పూజా హెగ్డే మూడు డిఫరెంట్ ప్రాజెక్ట్ లను పట్టేసి బాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారిపోయింది. మరి ఈ సినిమాలైనా ఆమెకు మరిన్ని మంచి అవకాశాలను తీసుకొస్తాయేమో చూడాలి.

రెండు బడా ప్రాజెక్ట్స్ నుంచి అవుట్…
రాధే శ్యామ్, ఆచార్య వంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్న తర్వాత పూజకు అవకాశాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా ఆమె చేయాల్సిన నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా నిరాశ తప్పలేదు. ఈ కంటిన్యూ డిజాస్టర్ ఫేజ్ కారణంగా గుంటూరు కారంతో పాటు మరో క్రేజీ మూవీ నుంచి పూజ తప్పుకోవాల్సి వచ్చింది. పనిలో పనిగా అవకాశాలు రాక ఖాళీగా ఉన్న పూజ హెగ్డే కెరియర్ క్లోజ్ అయ్యిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని ప్రచారం మొదలైంది. మరోవైపు పలు తెలుగు సినిమాల్లో పూజా హెగ్డే హీరోయిన్ అంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. కానీ వాటికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడంతో అవి ఇంకా రూమర్లుగానే ఉన్నాయి. పూజ మాత్రం తనపై వస్తున్న ఆ వార్తలను పట్టించుకోకుండా తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. వరుసగా మూడు ఆఫర్లు పట్టేసి బుట్ట బొమ్మ ఈజ్ బ్యాక్ అనిపించింది. మరి ఇప్పటికైనా టాలీవుడ్ నుంచి పూజాకు పిలుపు వస్తుందా? లేదా బాలీవుడ్ లోనే సెటిల్ అవుతుందా అనేది చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు