Relationship Tips : హనీమూన్ లో ఈ 5 మిస్టేక్స్ చేశారంటే అంతే సంగతులు

Relationship Tips : పెళ్లి తర్వాత హనీమూన్ ప్రతి జంటకు చాలా ప్రత్యేకం. పెళ్లి తర్వాత ప్రతి జంట ఈ ప్రత్యేక క్షణం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు. ఈ కీలకమైన సమయంలోనే నవ దంపతులు ఇద్దరూ కలిసి క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు. భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే హనీమూన్ కు వెళ్లి జీవితాంతం గుర్తుండిపోయే మెమోరీస్ ను క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత కూడా హనీమూన్‌కు వెళతారు. కానీ ఫస్ట్ లవ్ లాగా ఫస్ట్ హనీమూన్‌లో జరిగే మ్యాజిక్ రెండో లేదా మూడో హనీమూన్‌లో జరగదు. హనీమూన్ అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు. ఇదొక ఎమోషనల్ జర్నీ కూడా. అందుకే ఈ టైంలో ఏదైనా పొరపాటు చేస్తే అది మీ భవిష్యత్ జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు. ప్రతి కొత్త జంట ఒకరి జీవితాన్ని మరొకరు ఆనందంతో నింపాలని కోరుకుంటారు. కానీ తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేసి తమ సంతోషకరమైన సంబంధాన్ని ఇబ్బందుల్లో పారేసుకుంటారు. ముఖ్యంగా హనీమూన్‌లో ఈ తప్పులు చేయకుండా ఉంటే మీతో పాటు మీ పార్ట్నర్ కు కూడా అదొక లైఫ్ టైం గుడ్ మెమొరీ అవుతుంది. .

1. వివాహ సమయంలో జరిగిన గొడవల గురించి మాట్లాడటం

పెళ్లి జరిగే సమయంలో కొన్నిసార్లు గొడవలు కూడా జరుగుతుంటాయి. ఆ గొడవలు చూస్తే వివాహం ఆగిపోతుందేమో అన్పిస్తుంది. పెళ్లయ్యాక వాటి గురించి మళ్ళీ మాట్లాడితే రిలేషన్ పాడవ్వడం తప్ప ప్రయోజనం ఉండదు. హనీమూన్‌లో మీరు లేదా మీ భాగస్వామి మనసును డిస్టర్బ్ చేసే విషయాలను ఎప్పుడూ చర్చించకండి. పెళ్లిలో చాలా సార్లు ఇరువర్గాల మధ్య తగాదాలు జరుగుతుంటాయి. అది సర్వసాధారణం. ఈ గొడవలను ఆ సమయంలో మరిచిపోయి ముందుకు సాగాలి.

2. ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు

వైవాహిక జీవితం ప్రారంభంలోనే మీ భాగస్వామిపై ఎక్కువ అంచనాలను పెట్టుకోకండి. అలా చేయడం వల్ల మీ ఎమోషన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మీరు మొదట మీ భాగస్వామిని తెలుసుకోవడం, వారిని అర్థం చేసుకోవడం, వారి ఎక్స్పెక్టేషన్స్ గురించి ఆలోచించడం చాలా ముఖ్యం.

- Advertisement -

3. గతం గురించి ఎలాంటి ప్రశ్నలు అడగవద్దు

కొత్త జీవితం ప్రారంభించిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవడం అవివేకం. హనీమూన్‌లో మీ భాగస్వామికి అతని/ఆమె గతం గురించి ఎలాంటి ప్రశ్నలు అడగవద్దు.

4. వాదించుకోవడం మానుకోండి

పెళ్లయిన తొలినాళ్లలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీలైనంత ఎక్కువ సమయాన్ని వెచ్చించండి. ఈ సమయంలో వాదనలు లేదా గొడవలకు దూరంగా ఉండండి. మొదట్లోనే గొడవలు పడితే మీ ఫ్యూచర్ లైఫ్ పై ఎఫెక్ట్ తప్పదు.

5. హనీమూన్‌ని హోటల్ గదిలో గడపకండి.

హనీమూన్ కోసం చాలామంది తమకు నచ్చిన స్థలాన్ని ఎంచుకుంటారు, అయితే చాలా మంది జంటలు ఆ స్థలాన్ని విజిట్ చేయకుండా హోటల్ గదిలోనే సమయాన్ని గడుపుతారు. బదులుగా మీ భాగస్వామితో కలిసి కొత్త స్థలాన్ని సందర్శించండి. కొన్ని అడ్వెంచర్స్ చేసి మంచి మెమొరీస్ ను క్రియేట్ చేసుకోండి. అప్పుడే హనీమూన్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. అలాగే మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇద్దరి ఇష్టాలు, అయిష్టాల గురించి కూడా తెలుసుకుంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు