Shaitaan : సైలెంట్ గా వచ్చి రెండొందలు కొట్టేసాడు..

Shaitaan : బాలీవుడ్ లో ఈ ఇయర్ రిలీజ్ అంత గ్రాండ్ గా స్టార్ట్ అవలేదన్న విషయం తెలిసిందే. పక్కన చిన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా పది రోజులకో బ్లాక్ బస్టర్ వంద కోట్ల సినిమాలు ఇస్తుంటే, ఇండియా లో పెద్ద సినిమా ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ మాత్రం ఒక్క హిట్టు సినిమా ఇవ్వడానికి ఆపసోపాలు పడింది. ఏది ఏమైనా ఫైటర్, తేరి బాతో మే ఐసా ఉలిజా జియా, వంటి ఓ మోస్తరు హిట్లతో గాడిలో పడినట్టనిపించినా బాలీవుడ్ ఆశించిన విజయాలు మాత్రం కాలేకపోయాయి. కానీ అనూహ్యంగా సైలెంట్ గా వచ్చిన ఓ చిన్న సినిమా మాత్రం బాలీవుడ్ పరువు నిలబెట్టిందని చెప్పాలి. ఆ సినిమాయే ‘సైతాన్’. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, విలక్షణ నటుడు మాధవన్, అలాగే జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 8న పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయ్యి మౌత్ టాక్ తో మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చి లాంటి అన్ సీజన్ లో నెలలో రిలీజ్ అయ్యి కూడా రెగ్యులర్ మాస్ మూవీ తో కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్ కం డార్క్ సబ్జెక్ట్ తో వచ్చి సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపి రచ్చ లేపాడు.

హారర్ థ్రిల్లర్ గా ..

ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ లాంటి నటుడు ఈ సినిమాలో మెయిన్ లీడ్ అయినప్పటికీ ఈ సినిమా చాలా చిన్న కాన్సెప్ట్ తో చిన్న సినిమాగానే తెరకెక్కింది. కానీ రిజల్ట్ మాత్రం పెద్ద సినిమా రేంజ్ లో వచ్చింది. బాలీవుడ్ జనాలు కలెక్షన్లలో బ్రహ్మరధం పట్టారు. పైగా సైతాన్ మూవీ (Shaitaan) క్రిటిక్స్ నుండి ఎబో యావరేజ్ రేంజ్ రివ్యూలను సొంతం చేసుకోగా, రీమేక్ లు పెద్దగా వర్కౌట్ అవ్వని ఈ రోజుల్లో కూడా, గుజరాతి సినిమా అయిన వష్ కి రీమేక్ గా తెరకెక్కి, అన్ సీజన్ లో వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వని కంటెంట్ తో వచ్చి కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపిస్తూ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఆల్ మోస్ట్ నెల రోజుల థియేట్రికల్ రన్ పూర్తి అయ్యే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియాలో 145 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా గ్రాస్ 172 కోట్ల దాకా ఇండియాలో సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో 33 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా నెల రోజుల్లో 205 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు అజయ్.

ఈ వారం మైదాన్ తో..

ఇక ఫైనల్ గా ఈ సినిమా మరో 20 కోట్ల వరకు అదనంగా వసూలు చేయొచ్చని సమాచారం. మొత్తం మీద సైతాన్ (Shaitaan) సినిమా జోనర్ దృశ్యా ఇవి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ అని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉండటం విశేషం. ఇప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో స్టడీ కలెక్షన్స్ తో జోరు చూపిస్తున్న ఈ సినిమా రన్ ఎండ్ అయ్యే టైంకి థియేటర్స్ లో మళ్ళీ అజయ్ దేవగన్ నటించిన కొత్త సినిమా ‘మైదాన్’ రిలీజ్ కానుండటంతో ఆ సినిమాతో హీరో అజయ్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో అన్నది ఆసక్తిగా మారింది. ఇక మైదాన్ సినిమా దాదాపు పది సార్లకి పైగా వాయిదా పడుతూ వస్తుంది. ఫైనల్ గా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని అందుకోవాలని అజయ్ దేవగన్ ఆశిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు