Murali Mohan : సీనియర్ హీరో మురళీమోహన్ రెండుసార్లు పేరు మార్చుకోవడానికి కారణం..!

Murali Mohan : టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో ఒకరైన మురళీమోహన్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు.. 1973లో వచ్చిన జగమే మాయ అనే సినిమాతో మొదటిసారి తన సినీ కెరియర్ ని మొదలుపెట్టారు..మురళీమోహన్ అంటే అమ్మాయిలలో మాత్రమే కాదు హీరోయిన్ లలో కూడా మంచి క్రేజ్ ఉండేది.. ముఖ్యంగా ఆయనతో నటించడానికి సీనియర్ హీరోయిన్లు సైతం ఇష్టపడేవారు.. అంతలా పాపులారిటీ దక్కించుకున్న తన సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరించారు. గత ఏడాది నటుడుగా మురళీమోహన్ దాదాపుగా 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్నారు.

జగమే మాయ సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టిన మురళీమోహన్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ఏమిటంటే 1974లో వచ్చిన తిరుపతి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ , నటుడు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు.మురళీమోహన్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపుగా 350 కి పైగా చిత్రాలలో నటించారు.. నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించారు.. తన 100వ చిత్రం వారాలబ్బాయి సినిమాతో నిర్మాతగా మొదటిసారి తన సినిమాను తెరకెక్కించారు. అలా దాదాపుగా 25 చిత్రాలకు ప్రొడ్యూసర్ గా చేశారు. అందులో మహేష్ బాబు నటించిన అతడు సినిమా కూడా ఒకటి..

అందుకే మురళీమోహన్ పేరు మార్చుకున్నారు..

మురళీమోహన్ గా పరిచయమైన ఈ నటుడు అసలు పేరు మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు.
ఈ విషయాన్ని మురళీమోహన్ ఇటీవలే అందరికీ తెలియజేశారు.. మురళి మోహన్ తండ్రికి స్వాతంత్ర సమరయోధులు అంటే చాలా ఇష్టమట.. అంతేకాకుండా ఆయన కూడా అలాంటి ఉద్యమాలలో చాలానే పాల్గొన్నారు.. దీంతో అలాంటి వారి పేర్లను కూడా తమ పిల్లలకు పెట్టాలనే ఆలోచన తన తండ్రికి వచ్చిందని మురళీమోహన్ తెలిపారు. ఈ క్రమంలోనే మురళీమోహన్ పేరుని “రాజా రామ్మోహన్ రాయ్” అని పేరు పెట్టారట.. అయితే స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఈ పేరుని “రాజా బాబు” గా మార్చుకున్నారని తెలియజేశారు.

- Advertisement -

మళ్లీ మార్పు..

ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మరొకసారి పేరు మార్చుకున్నాను అంటూ అదే మురళీమోహన్ గా అందరికీ పరిచయమయ్యానని వెల్లడించారు. ఇలా రెండుసార్లు మురళీ మోహన్ తన పేరుని మార్చుకున్నాను అంటూ వెల్లడించారు.. మురళీమోహన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి పెళ్లి అవ్వడమే కాకుండా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది.. గతంలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన మురళీమోహన్ ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమవుతున్నారు.

రాజకీయంలో కూడా హస్తం..

సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు రాజకీయాలలో మురళీమోహన్ ( Murali Mohan ) చురుగ్గా పాల్గొనేవారు.. ఆ పార్టీ తరపున ఎంపీగా కూడా గెలుపొందారు.. అయితే ఆ తర్వాత కాలంలో జరిగిన పరిణామాల వల్ల రాజకీయ జీవితానికి స్వస్తి పలికి.. ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే దివంగత నటుడు శోభన్ బాబు సలహా మేరకు అప్పట్లో రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగిన మురళీమోహన్ భారీగా సంపాదించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతగా ఫెయిల్ అయినప్పటికీ కూడా నటుడిగా రాజకీయవేత్తగా సక్సెస్ అయ్యి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు మురళీమోహన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు